Telugu News

అశ్వారావుపేట లో టాస్క్ ఫోర్స్ మెరుపుదాడులు

భారీగా నగదు బంగారు వెండి నగలు స్వాధీనం

0

అశ్వారావుపేట లో టాస్క్ ఫోర్స్ మెరుపుదాడుల

* అక్రమ చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారుల ఇల్లు దుకాణాల్లో ఏకకాలంలో సోదాలు

*భారీగా నగదు బంగారు వెండి నగలు స్వాధీనం

(శివకుమార్, అశ్వరావుపేట -విజయం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం సిసిఎస్ మరియు టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేపట్టాయి. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం అక్రమ చిట్ ఫండ్, ఫైనాన్స్ లను నిర్వహిస్తున్నవారి విశ్వసనీయ సమాచారంతో పలువురు వడ్డీ, చిట్టి వ్యాపారస్తుల దుకాణాలు ఇళ్లపై ఏకకాలంలో దాడులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించారు.

Alsoread-బీరు సీసాలతో కొట్టి.. టీఆర్ఎస్ నాయకుడి హత్యకు యత్నం

భద్రాచలం రోడ్డు లో ఫైనాన్స్ షాప్ నిర్వహించే సదా మోహన్ బాబు వద్ద నుంచి తాకట్టు పెట్టుకున్న 105 బంగారు ఆభరణాలు ప్యాకెట్, 14 వెండి ఆభరణాల ప్యాకెట్. మరియు రూ.3,49,970 నగదు అక్రమ బాండు పేపర్లు, సంతకాలు చేయని చెక్కులు ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బస్టాండ్ సెంటర్లో బుక్ స్టాల్ నిర్వహించే కంచర్ల రమేష్ గుప్తా వద్ద నుంచి రూ.1,66,750 నగదు, అక్రమ ప్రాంసరీ నోట్లు, సంతకాలు లేని చెక్కులు.లైసెన్సు లేకుండా అధిక వడ్డీతో నిర్వహిస్తున్న చిట్టిలు, ఫైనాన్స్ కు సంబంధించి మొత్తం రూ. 5,16,720 నగదు మరియు సుమారుగా రూ.25,00,000 విలువచేసే బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిరువురు పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొన్నారు.దాడుల్లో పట్టుబడిన నగదును అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ సత్యనారాయణకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ పుల్లయ్య తెలిపారు. మంగళవారంతో ఈ దాడులు ముగిసిపోలేదని బుధవారం కూడా కొనసాగనున్నాయని ప్రచారం జరుగుతుంది. దీంతో కొందరు వ్యాపారులు ఇళ్లకి దుకాణాలకు తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా టాస్క్ ఫోర్స్ దాడులతో అశ్వారావుపేట మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

Also read-ఆ ఇద్దరికి నో చాన్స్..? రాజ్యసభకు దక్కని అవకాశం