Telugu News

గులాబీ పార్టీకి తాటి ఝలక్..

మూడుముక్కలైన గులాబీ పార్టీ

0

గులాబీ పార్టీకి తాటి ఝలక్

== తొక్కేస్తున్నారంటూ ఆరోపణ

== అశ్వరరావుపేట టీఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు

== మూడుముక్కలైన గులాబీ పార్టీ

== పార్టీ శ్రేణుల్లో గందరగోళం

అశ్వరరావుపేట, జూన్ 21(విజయంన్యూస్)

గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పెద్ద జలక్ ఇచ్చారు.. ఇప్పటి వరకు నిశబ్ధంగా ఉన్న ఆయన ఒక్కసారిగా పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు.. నేను కేటీఆర్ కంటే సీనియర్ను, నన్ను తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు..తుమ్మలపై ద్వజమెత్తాడు.. తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు..గిట్లైతే నేను బోతా అంటూ ప్రకటించిండు. దీంతో అశ్వరరావుపేట కారు పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమన్నది..ఇప్పటికే నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఇప్పుడు భగ్గుమంటోంది.. అక్కడ పార్టీ  మూడుముక్కలాటలా  తయారైంది.. అసలు అశ్వరరావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఏమైంది..? ఎందుకు సీనియర్ నాయకుడు అలకబూని ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఇప్పటి వరకు ముక్కుపై వేలేసుకుని ఉన్న ఆ నేత ఎందుకు అగ్రనేతలపై ఫైర్ అవుతున్నారు..? అసలేం జరిగింది..? ఇదంతా చదవాలంటే ‘విజయం’ ప్రతినిధి అందించే పూర్తి కథనాన్ని చదవాల్సిందే..?

allso read- ఇట్టా అయితే నేనుబోతా..? తాటి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వరరావుపేట నియోజకవర్గం 2009లో నూతన నియోజకవర్గంగా ఏర్పడింది.  ఎస్టీ రిజర్వేడ్ గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆంధ్రసెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. చాలా నిశబ్ధంగా ఉండే ఈ నియోజకవర్గంలో గతంలో వర్గపోరు ఉన్నప్పటికి బహిర్గతమైన సందర్భాలు చాలా తక్కువ.  ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఆంద్రపార్టీల వైపే అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన పార్టీలను పరిస్థితి చూస్తే అది అర్థమవుతుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒగ్గెల మిత్రసేనా విజయం సాధించగా, 2014లో వైసీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. 2014 టీఆర్ఎస్ నుంచి అదినారాయణ, 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి తాటి వెంకటేశ్వర్లు పోటీ చేసి ఓటమిచెందారు. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆశీర్వదించలేదు. అందుకే ఎక్కువగా ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకే అక్కడ మొగ్గు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో వర్గాలే లేవు. గతంలో ఉన్నప్పటికి అవి అంతబహిర్గతం కాలేదు. విలేకర్ల సమావేశం నిర్వహించడమో, లేదంటే బహిరంగంగా స్వంత పార్టీలపై ఆరోపణలు చేయడమనేది జరగలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు పూర్తిగా బిన్నంగా ఉన్నాయి. అశ్వరరావుపేటలో ఖాతా తెరిచేందుకు ప్రయత్నం చేయాల్సిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు తన్నులాడుకునే పనిలో పడ్డారు. వర్గపోరుతో బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎందుకుని…?

 

== మూడుముక్కలాటేనా..?                                              allso read- అప్పుడే మొదలైన రైతు కష్టాలు.

అశ్వరరావుపేట టీఆర్ఎస్ పార్టీ మూడుముక్కలైనట్లు కనిపిస్తోంది. 2009 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కరువైయ్యారు. ఆ తరువాత 2014లో ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న అదినారాయణను పోటీ చేయించారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా వైసీపీ అభ్యర్థిగా గెలిచిన తాటీ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అయితే ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడు బహిరంగంగా ఆరోపణలు చేసుకోలేదు. అధినేత మాటను శిరషా వహించారు. అందులో భాగంగానే తాటి వెంకటేశ్వర్లకు 2018లో టిక్కెట్ దక్కింది. కానీ ఆయన టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. అనంతరం 2021లో మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. కాగా సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. దీంతో మెచ్చా నాగేశ్వరరావు వన్ సైడ్ పరిపాలన చేస్తూ వెళ్తుండటంతో అటు అదినారాయణ, ఇటు తాటి వెంకటేశ్వర్లు వారి అనుచరులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే అదినారాయణ మాత్రం గత మూడేళ్ల నుంచి ఆయన నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటన చేస్తున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబాన్ని కలిసి మాట్లాడి అప్యాయత పలకరిస్తున్నారు. తన వేవ్ లో తాను పర్యటన చేస్తూ వెళ్తున్నాడు. దీంతో అశ్వరరావుపేట టీఆర్ఎస్ పార్టీ మూడుముక్కలైనట్లే కనిపిస్తోంది. ఒక వైపు అదినారాయణ స్వంతంగా పర్యటన చేస్తుండగా, తాటి వెంకటేశ్వర్లు స్వంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక మెచ్చ నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా తనపనితాను చేసుకుంటున్నారు. దీంతో అశ్వరరావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మూడుముక్కలై వర్గపోరు భగ్గుమంటోంది.

== తాటికి అవమానం జరుగుతుందా..?

టీఆర్ఎస్ పార్టీలో ఎస్టీ రిజర్వడ్ ప్రాంతాల్లో సీనియర్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు. ఆయనను అశ్వరరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా అవమానిస్తున్నారని, రాజకీయంగా అణగదొక్కేందుకు చూస్తున్నారని ఆయన నేరుగా ఆరోపిస్తున్నారు. సభ్యత్వాల్లో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో నాకు సమాచారం ఉండటం లేదని, పిలవకుండా అవమానిస్తున్నారని ఆరోపించారు. మెచ్చా నాగేశ్వరరావుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సపోర్టు చేస్తూ నాపై ఆరోపణలు చేస్తున్నాడని తాటి బహిరంగానే ఆరోపించాడు. ఎమ్మెల్యేగా గెలవలేని తుమ్మల నాపై బురదజల్లే మాటలు మాట్లాడటం సరైంది కాదని, పద్దతి మార్చుకోకపోతే పార్టీ నుంచి వెళ్లిపోతానని అంటున్నాడు. వాస్తవికతను పరిశీలిస్తే కచ్చితంగా మొచ్చా నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు తాటి వెంకటేశ్వర్లను పట్టించుకోవడంలేదనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనకు సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీ నామినేటేడ్ పదవుల్లో కూడా మెచ్చా నాగేశ్వరరావు తో పాటు పార్టీలో చేరిన వారికి మాత్రమే ఇస్తున్నారని, తాటి అనుచరులకు పదవులు రాలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అందుకే ఇప్పటి వరకు ఒపిగ్గా ఆలోచించిన తాటి వెంకటేశ్వర్లు, పరిస్థితిని ముందే చక్కబెట్టే ఆలోచనతో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మరి ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కబెడితే పర్వాలేదు, లేదంటే వేరే పార్టీలోకి వెళ్లి ఇప్పటి నుంచే నియోజకవర్గంలో పర్యటించి పూర్తిగా ఆదీనంలోకి తెచ్చుకోవచ్చనే రాజకీయ వ్యూహంతో విలేకర్ల సమావేశం నిర్వహించి ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

== పార్టీ నేతల్లో గందరగోళం                            allso read-  షర్మిల ప్లాన్ ఏంటి..?

అశ్వరరావుపేట నియోజకవర్గంలోని కారు పార్టీలో గందరగోళం నెలకొంది. ముగ్గురు ఆశావాహులు ఉండటంతో ఎవరి వైపు తిరగాలి, ఎవరికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందనే విషయంలో పార్టీ శ్రేణులు తర్జనభర్జన పడుతున్నారు. అంతే కాకుండా ఈ రోజు తాటి వెంకటేశ్వర్లు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి నన్ను, నా అణుచరులను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, గిట్లైతే నేను బోతా అని చెప్పడంతో ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా బలం లేకపోయినప్పటికి అధికార పార్టీ కావడంతో తప్పని పరిస్థితిలో ప్రజలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరికి సీటు వస్తుంది..? ఎవరు గెలుస్తారనే ఆలోచనతో పార్టీ శ్రేణులు కొంత సమన్వయం పాటిస్తున్నట్లు తెలుస్తుంది.. చూద్దాం రాబోయే రోజుల్లో తాటీ వెంకటేశ్వర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. ఆయన చేసిన సూచనను పార్టీ తీసుకుంటుందా..? పట్టించుకోకుండా వదిలేస్తారా..? వేచి చూడాల్సిందే..?