Telugu News

ఫారెస్ట్ అధికారులు మాపై దాడి చేశారు : రైతులు

మేం అడవిని నమ్ముకొన్న అడవిబిడ్డలం..గిరిజనులం

0

ఫారెస్ట్ అధికారులు మాపై దాడి చేశారు: రైతులు 

== మేం అడవిని నమ్ముకొన్న అడవిబిడ్డలం..గిరిజనులం

== ఇసుక మాఫియా – దాడి అంతా కల్పనమాపై బురద జల్లుతున్నారు.*

== పోడు భూమిని దున్నుతుంటే ఆపారు

== గత ఇరవై సంవత్సరాలుగా పోడు చేస్తున్నాము

అశ్వారావుపేట జూలై 5( విజయం న్యూస్)

తెగ పడిన ఇసుక మాఫియా,కర్రలతో దాడి అంటు మంగళవారం ఉదయం వచ్చిన వార్త సంచలనం రేపిన విషయం విధితమే.ఈ వార్త వెనుక గల కధనాన్ని ఓ పాత్రికేయ బ్రుందం . అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం పంచాయితి బండారు గుంపు ప్రాంతాన్ని సందర్శించింది.వారు చెప్పిన విషయం ప్రకారం ఫారెస్ట్ అధికారులు బహుటక్కరి వాళ్లని,అడవిని నమ్ముకొని బ్రతికే గిరిజనులపై బురదజల్లుతున్నారని అగ్రహాం వ్యక్తం చేసారు.ఇసుక మాఫియా ,కర్రలతో దాడి,జీపు తగలబెట్టటానికి ప్రయత్నం అంతా అభూత కల్పన అని కొట్టి పారేసారు.తాము గత ఇరవై సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నామని,గత అయిదు సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి :- తెగబడిన ఇసుక మాఫియా*

ఈ యేడాది సీజన్ మొదలైంది కాబట్టి ఎట్టి పరిస్తితులలో వ్వసాయం వేయాలని ,రాత్రిపూట ట్రాక్టర్లతో దుక్కి దున్నుతున్నామని,రాత్రి ఏడున్నర సమయం లొ ఇన్ ఛార్జ్ ఎఫ్.అర్.ఒ అతివేగంగా జీపు నడిపిస్తు మా దగ్గరకొచ్చి ఆపేయాలని ఆదేశించారు,మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దున్నటం ఆపమని,చెప్పామన్నారు.ఈ విషయం తెలిసిన గ్రామస్థులు అందరు గుమికూడారని ,ఎట్టి పరిస్తితులలో పోడు భూమిని వదలమని చెప్పాం కాని జీపు పై పెట్రోల్ వేయటం,డ్రైవర్ ని బెదరించి ఫోన్ లాక్కోవడం,కర్రలతో దాడి చేయడం అభద్దమని వారు పేర్కొన్నారు. మాపై తప్పడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు.మా జీవనాధారం లాక్కొంటే మేమెలాగ బ్రతికేది అంటు వారు ప్రశ్నించారు. ఈ ఉదంతం లొ ఎన్నొ సందేహాలు తలెత్తున్నాయి.ఇసుక మాఫియా గురించి సమాచారం తెలిసి ,రైడింగ్ కి బయలుదేరినప్పుడు స్దానిక స్టేషన్ లొ చెప్పిన ధాఖలా లేదు.ఇక పట్టుకోవడానికి అదీ ఇసుక మాఫియా అని తెలిసి ఇద్దరే వెళ్లటం అనుమానాలకు తావిస్తుంది.

 ఇది కూడా చ దవండి :- పేదల నడ్డి విరుస్తున్న వారాల వడ్డీ..