Telugu News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పుల చేరిగిన తాటి

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే తాటి

0

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పుల చేరిగిన కాంగ్రెస్ నేత తాటి

★పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే తాటి

★ భద్రాద్రి వరద బాధితులకు తక్షణమే సహాయం అందించాలి

★కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలి

★ రైతులకు రుణాలు ఇవ్వాలి, రైతులకు ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలి

(రిపోర్టర్ :శివనాగిరెడ్డి, శివకుమార్)

చంద్రుగొండ, అశ్వరావుపేట,జులై 26(విజయంన్యూస్)
అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం గ్రామంలో విలేకరుల సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుపై అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత తాటి వెంకటేశ్వర్లు గారు విరుచుకుపడ్డారు ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు దశాబ్దాల కాలం నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూములలో హరితహారం పేరుతో భూములు లాక్కోవడం దుర్మార్గమైన చర్య అన్నారు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఇట్టి దాడులు ఆపాలని ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు YS. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరిజనులకు పోడు భూములు ఇచ్చారని గుర్తు చేశారు.

ALLSO READ- అరెంజ్ అలార్ట్ హెచ్చరిక
★ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తం అయ్యాయని అన్నారు, పంటలు వేసిన రైతులు నష్టపోయారు అని అన్నారు ఇల్లు నేలమట్టం అయ్యాయని ఎన్నో మూగజీవాలు గోదావరి ప్రవాహానికి గల్లంతు అయ్యాయని స్థానిక అధికారులు రాజకీయ ప్రమేయం లేకుండా ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మాటలకే పరిమితమైందని గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీని విస్మరించారని మళ్లీ వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలకు గోదావరి వరదల నుండి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలు తక్షణమే ఇవ్వాలి అని అన్నారు.
★ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జరిగిన అవకతవకలకపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దేనికి నిదర్శనం అని అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలేశ్వరం మోటార్లు నీట మునిగాయి అని దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎంత గొప్పగా నిర్మించిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని అన్నారు,కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిటింగ్ జడ్జితో విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ALLSO READ- భద్రాచలం భవిష్యత్తేమిటి?
★ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు బేషరతుగా రైతులకు రుణమాఫీ చేయాలని రైతు తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు సకాలంలో రుణమాఫీ జరగక రైతుకు బ్యాంకర్లు అప్పు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బేషరతుగా రుణమాఫీ చేసి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలి అన్నారు… ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భారత్ భీముడు నాయక్ గారు, చెరుకూరి రవి గారు, పెద్దారపు నాగరాజు గారు, చల్లా రమేష్ గారు, ఇనపనూరి రాంబాబు గారు, జంగిల్ బిక్షం గారు, బట్టు నరసింహారావు గారు, అట్ల వెంకటేశ్వర్లు గారు, వీరబోయిన ఆదినారాయణ గారు, వీరబోయిన సత్యం గారు, కోమటి గోపాలరావు గారు తదితరులు పాల్గొన్నారు.