Telugu News

ఆశ్వరరావుపేటలో పొంగిపోర్లుతున్న చెరువులు

తెగుతున్న కట్టలు.. రహదారులపై ప్రవహిస్తున్న వరదలు

0

అశ్వారావుపేటలో పొంగిపోర్లుతున్నచెరువులు

(అశ్వారావుపేట -విజయం న్యూస్)
గులాబ్ తుఫాన్  ప్రభావం వల్ల అశ్వారావుపేట అతాకుతలం అయింది. అల్పపీడనం ప్రభావం వల్ల ఆదివారం రాత్రిన నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోమండల వ్యాప్తంగా ఉన్న చెరువులన్ని ఉప్పొంగుతున్నాయి. చెరువులన్ని అలుగులు పారతున్నాయి.వాగొడ్డుగూడెం సమీపం లో వాగు ఉదృత్తంగా ప్రవహిస్తుండటంతో రహదారి పై నీళ్ళు ప్రవహిస్తున్నాయి. దీంతో పోలీసులు రాకపోకలను కంచెకట్టి మూసివేసారు.పెదవాగు ప్రాజెక్ట్ పరిదిలోకి వరద నీరు వస్తుండటంతో ఒక గేటు ఒక అడుగు ఎత్తి లేపి  90 క్యూసెక్కుల నీరు బయటకు వదులుతున్నారు.

అదేవిదంగా కావడిగుండ్ల బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు  కొట్టుకు పోవడంతో,రాకపోకలు నిలిపివేసారు.అంకమ్మ చెరువు నిండు కుండను తలపిస్తు,అలుగు పారుతుంది. ఇలా మండలంలో వాగులు వంకలు  ఉదృత్తంగా  ప్రవహిస్తున్నాయి. ఇదిలాఉండగా ఎమ్మెల్యే మెచ్చా.నాగేశ్వరరావు అధికారులందర్ని అప్రమత్తం చేసారు.లో లెవల్ బ్రిడ్జ్ లు,ర్యాంపులు ఉన్నచోట దాటటంగాని, సెల్ఫీలు దిగటం చేపలు పట్టటం వంటివి చేయవద్దని హెచ్చరికలు జారీ చేసారు.కరెంటు స్తంబాలు,స్టేవైర్ ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని,సాద్యమైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి నట్టు సమాచారం లేదని,సుమారుగా 75 ఎకరాల వరి పంట నీట మునిగిందని అధికారులు తెలియచేసారు.అందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.