Telugu News

రామన్నగూడెం గ్రామస్థులకు ఏమైనా జరిగితే ఊరుకోం: తాటి

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం... తాటి హెచ్చరిక*

0

*రామన్నగూడెం గ్రామస్థులకు ఏమైనా జరిగితే ఊరుకోం: తాటి

◆◆ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం… తాటి హెచ్చరిక*

◆◆ అటవీహక్కుల కోసమే వాళ్ళ పోరాటం

◆◆ రామన్నగూడెం ని హైదరాబాదు చేయమన అడిగిర్రా

◆◆ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు కొన్ని హక్కలున్నాయి

◆◆ పోలీసులు సహకరించండి*

ములకలపల్లి/అశ్వారావుపేట జూన్ 27 ( విజయం న్యూస్)

రామన్నగూడెం గ్రామస్థులు పాదయాత్రను అడ్డుకొని పోలీస్‌ లు అరెస్ట్ చేసిన విషయం పై మాజీ ఎమ్.ఎల్.ఎ,ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వరరావు స్పందించారు.ఛరవాణి లొ సి.ఐ తో మాట్లాడారు. వారిని ఎక్కడకు తీసుకెళ్ళతున్నారని తెలుసుకొన్నారు,వారిని ఏమి చేయవద్దని కోరారు.తాము గిరిజనులమని,తమ ప్రాంతాన్ని హైదారాబాద్ చేయమని కోరటం లేదని,అడవిని నమ్ముకొని బ్రతుకుతున్న తమకి బ్రతకటానికి అవసరమైన భూమి హక్కు ఇవ్వమని కోరుకొంటున్నామన్నారు.

Allso read:- ప్రారంభమైన పాదయాత్ర.. అడుకున్న పోలీసులు

అటవీ అధికారులు మీ సహకారంతో వారిని ఇబ్బంది పెడుతున్నారని,ఇది సమంజసం కాదని,వారి హక్కుల కోసం వారు శాంతియుతంగా పోరాడుతున్నారని సహకరించాలని కోరారు.ఒక భాద్యత కల గిరిజన నాయకుడిగా నా జాతికి అన్యాయం జరిగితే తాను అక్కడ ఉంటానన్నారు.వారిని ఇబ్బంది పెట్టవద్దని పదేపదే సిఐ ని హెచ్చరించారు.అనంతరం ములకలపల్లి చేరుకొని రోడ్డు పై భైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.రామన్నగూడెం గ్రామస్తులకు ఏమైనా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.