Telugu News

అశ్వారావుపేట లో టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు..

అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు

0

అశ్వారావుపేట లో టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు..

** *అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు

** *ఆధ్వర్యంలో 250 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలో చేరిక

(రిపోర్టర్ -శివకుమార్)
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (విజయం న్యూస్):- మండలంలోని తాటిసుబ్బన్నగూడెం(గ్రామం)లో దమ్మపేటకు చెందిన *250* కుటుంబాలు సోమవారం అశ్వారావుపేట అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.దమ్మపేటకు చెందిన సిపిఐ నాయకుడు పండూరి వీరబాబు ఆ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు.

ఇది కూడా చూడు:-వల్లభిలో హత్య

అలాగే ఇతర పార్టీలకు చెందిన వివిధ నాయకులు,కార్యకర్తలు,యువకులు టీఆరెఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారినీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ  సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రవేశ పెట్టడం వలనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రతి నాయకుడిని,కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్,అబ్దుల్ జిన్నా,కవులురి నాగయ్య,తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:- చిన్నారి మేఘన అదృశ్యంపై వీడని మిస్టరీ……?