క్వార్టర్ బాటీల్ లో కల్తీ జరిగిందా..?
== పుల్ బాటీళ్లలో కూడా ఇదే సమస్య..?
== వైన్ షాపు వద్ద ఉద్రిక్తత
== చర్యలు తీసుకోవాలని డిమాండ్
(రిపోర్టర్ : శివకుమార్)
అశ్వారావుపేట ఆగస్ట్ 1( విజయం న్యూస్)
మద్యం కల్తీ చేయోచ్చా..? మందు తీసి నీళ్లను పోస్తే ఆ మందు కలర్ మారుతుందా..? బాటిల్ సీల్ ఉండగానే.. కల్తీ ఎలా సాధ్యమవుతుంది..? అంటే సాధ్యమవుతుందనే వైన్ ప్రియులు చెబుతున్నారు. ఈ మేరకు వైన్స్ దుకాణం వద్ద గొడవ చేశారు. కల్తీ జరిగిందని బల్లా గుద్ది చెబుతుంటే, వైన్స్ యజమానులు మాత్రం అలాంటిదేమి లేదన్నట్లు చెబుతున్నారు.. అశ్వారావుపేట పట్టణంలోని వెంకట దుర్గా థియేటర్ సమీపంలోని ఈశ్వర వైన్స్ షాప్ నందు మద్యం కల్తీ చేస్తున్నారంటూ వినియోగదారుల ఆందోళన చేసారు.వివరాలలోకి వెళ్లితే.ఓ వినియోగదారుడు ఒకే బ్రాండ్ కి సంబంధించి మూడు క్వార్టర్లు తీసుకున్నాడు.విచిత్రంగా మూడు వేరువేరు రంగులో ఉండడంతో అనుమానమొచ్చి వైన్ షాప్ యాజమాన్యాన్ని నిలదీశారు. మద్యం కల్తీ కి పాల్పడుతుందంటూ వైన్ షాప్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.దీంతో సదరు వైన్ షాప్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఇలా ఏర్పడడంతో సంఘటనా స్థలానికి అబ్కారి సిబ్బంది చేరుకుని,నాలుగు మద్యం బాటిళ్లను సీజ్ చేసారు. ఎక్ససైజ్ ఎస్ ఐ శ్రీ హరి వివరణ మద్యం బాటిళ్లను సీజ్ చేసామని ల్యాబ్ కి పంపిస్తామని,నివేదిక వచ్చిన అనంతరం కల్తీ జరిగితే షాప్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. allso read- ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..?