Telugu News

ఖమ్మంలోని కమల ఆసుపత్రిలో అరుదైన వైద్యం

50 సంవత్సరాల మహిళ కడుపులో 9కేజీల క్యాన్సర్ గడ్డ

0

ఖమ్మంలోని కమల ఆసుపత్రిలో అరుదైన వైద్యం
== 50 సంవత్సరాల మహిళ కడుపులో 9కేజీల క్యాన్సర్ గడ్డ
(ఖమ్మం-విజయంన్యూస్);-
ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న శ్రీకమల జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు అరుదైన వైద్యం చేశారు.
బోనకల్లు గ్రామానికి చెందిన గద్దె పద్మ భర్త కృష్ణయ్య అనే 50 సంవత్సరాల మహిళ కడుపునొప్పితో గత రెండు రోజుల క్రితం శ్రీ కమల జనరల్ హాస్పిటల్ వైరా రోడ్డు ఖమ్మం ను సంప్రదించగా పొట్ట స్కానింగ్ చేసి సుమారుగా తొమ్మిది కేజీల క్యాన్సర్ గడ్డ ఉన్నదని నిర్ధారించారు.

also read :-లక్ష్యాన్ని చేదించేందుకు పేదరికం అడ్డుకాదు

అనంతరం గురువారం రాత్రి 11 గంటలకు ఆసుపత్రి వైద్యులు లాప్రోస్కోపిక్ జనరల్ & క్యాన్సర్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ సురేష్, ఓటీ అసిస్టెంట్ రాజు, విజయ రాజు, నర్స్ మౌనిక ,అనిత హాస్పిటల్ మేనేజ్మెంట్ నారపోగు సుదర్శన్ ఎస్ కె యాకోబు, కోటి ఆధ్వర్యంలో విజయవంతంగా తొమ్మిది కేజీల క్యాన్సర్ కణితిని తొలగించారు. ఈ సందర్భంగా రోగి కుటుంబ సభ్యులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని డాక్టర్ చెప్పారు.