కొత్తపల్లి ప్రభాకర్రెడ్డిపై దాడి హేయం: బీఆర్ఎస్
== విలేకర్ల సమావేశంలో కారేపల్లి మండలం అధ్యక్షుడు
కారేపల్లి, అక్టోబర్ 31(విజయం న్యూస్):
బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి కొత్తప్రబాకర్రెడ్డిపై దుండగులు దాడి చేసి గాయపరచటం హైయమైన చర్యని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ అన్నారు. మండల కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు మాట్లాడుతూ
ఇది కూడా చదవండి:- “చంద్రబాబు” నేడే విడుదల
ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోకవటం చేతకాకనే కొన్ని రకాల శక్తులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడని, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో జడ్పీటీసీ వాంకుడొత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, నాయకులు హన్మకొండ రమేష్, నర్సింగ్ శ్రీనివాసరావు, ఉన్నం వీరేందర్, బద్దూలాల్, గౌసుద్దీన్, బానోత్ కుమార్, భూక్య చందూనాయక్, కరణ్ సింగ్, రోషయ్య, భూక్య రాంకిషోర్, బానోత్ కోటి, సోమందులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:+;బీఆర్ఎస్ పార్టీకి జలగం గుడ్ బై.