Telugu News

ప్రభాకర్ రెడ్డి పై దాడి హేయం : ఎంపీ నామ

బీఆర్ఎస్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

0

ప్రభాకర్ రెడ్డి పై దాడి హేయం : ఎంపీ నామ

🔸గెలవలేకే దాడులు

🔸 పార్టీలకతీతంగా ఖండించాలి

🔸 ఓటుతోనే గుణపాఠం నేర్పాలి

👉 బీఆర్ఎస్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం , అక్టోబర్ 30 : సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై దుండగులు హ‌త్యాయ‌త్నం చేయడాన్ని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించి, గర్హించారు. ఎన్నిక ప్ర‌చారంలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి:- మంత్రి పువ్వాడ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు..

ఈ దాడిలో
కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయని నామ పేర్కొన్నారు. తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌భాక‌ర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారని తెలిపారు. ఈ ఘ‌ట‌న దౌల్తాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుందన్నారు.ప్రజాస్వామ్య o లో ఇటువంటి దాడులు కరెక్ట్ కాదన్నారు.ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఆయన్ని ఎదుర్కొనే సత్తా లేక ఈ విధమైన దాడులకు పాల్పడడం దారుణమన్నారు . ఈ దాడిని ప్రజస్వామ్య వాదులంతా పార్టీలకతీతంగా ముక్త కంఠంతో ఖండించా లన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నామ ప్రభుత్వాన్ని కోరారు. శాంతి యుతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేయడం బాధాకరమ న్నారు.

ఇది కూడా చదవండి:-;నాది స్వరజన మతం.. నేను అందరి వాడను:మంత్రి పువ్వాడ 

ప్రజల చేతిలో గెలవడం చాతకాక దొడ్డిదారిన దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ దాడులను అందరూ తిప్పి కొట్టాలన్నారు.ఓటు ద్వారానే ఇటువంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. . ఇది పిరికి పందల చర్యగా నామ అభివర్ణించారు.