Telugu News

ఇల్లు కూల్చి వేత యత్నం..మహిళలపై దాడులు తగవు

నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు రక్షణ కల్పించాలి

0

ఇల్లు కూల్చి వేత యత్నం..మహిళలపై దాడులు తగవు

== నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు రక్షణ కల్పించాలి*

== తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు డిమాండ్.*

== సంఘటన స్థలాన్ని సందర్శించిన ప్రజా సంఘాలు , మహిళా సంఘాలు*

(ఖమ్మం -విజయం న్యూస్):

కోర్టు పరిధిలో కేసు నడుస్తుండగా ఈ స్థలం తమదని ఆరోపిస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మాఫియా కు చెందిన వ్యక్తులు శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీ 15వ లైన్ చివరి లో ఉన్న ఇంటిని రెండు జెసిబి లు , ఒక డోజర్ నూ తీసుకొని , ఇల్లు కూల్చి వేతకు ప్రయత్నించటం , ఆ సమయంలో ఇంటిలో ఉన్న మహిళలపై కర్రలతో మరియు రాళ్లతో దాడులకు పాల్పడటం భావ్యం కాదన్నారు . వెంటనే నిందితులను అరెస్టు చేసి , రిమాండ్ కు తరలించి , బాధితులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి కృష్ణారావు డిమాండ్ చేశారు . శనివారం సంఘటన స్థలానికి ప్రజా సంఘాలు , మహిళా సంఘాలతో కలిసి సందర్శించి మాట్లాడారు . కోర్టు పరిధిలో ఇంటికి సంబంధించిన వివాదం ఉండగా చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోవడం సమంజసం కాదని , ఖమ్మం నగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలకు ఇది ఒక నిదర్శనం అన్నారు . పోలీసులు వారితో పాటు ఉన్నతాధికారులు , ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేకూర్చాలని కోరారు . స్థానిక పోలీసులు కొందరు , మరి కొందరు రాజకీయ నాయకులు ఇందులో కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని వారు ఆరోపించారు . వీరి వెనక బడా రాజకీయ నేతలు ఉండటం వల్ల ఈ మాఫియా ఈ విధంగా రెచ్చిపోయిందని తెలిపారు . నిన్న మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తుల ప్రమేయం ఉందన్నారు . ఈ విషయంలో న్యాయం జరిగే వరకు తాము వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు . జిల్లాలో న్యాయం జరగకుంటే రాష్ట్రస్థాయిలో కూడా తాము ఉద్యమిస్తామన్నారు . వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు ఉపేంద్ర బాయి , జిల్లా ప్రధాన కార్యదర్శి ఝాన్సీ , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా కన్వీనర్ విక్టోరియా , బీసీ మహిళా సంఘం నాయకురాలు రెడ్డి బోయిన వరలక్ష్మి , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఎస్.కె .నజీమా లు మాట్లాడుతూ ఇంటిలో మహిళలు ఉండగా కొందరు దుండగులు ఇల్లును కూల్చివేతకు ప్రయత్నించటం , మహిళలపై కర్రలు రాళ్లతో దాడులు పాల్పడటం హేయమైన చర్య అన్నారు . ఖమ్మం జిల్లా లో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని , ఆ మంత్రులు దీనిపై వెంటనే దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఇలాంటి సంస్కృతి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకోవటం భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయాన్ని గమనించాలని సూచించారు . ఈ మహిళలకు తమ మహిళా సంఘాలు అండదండలుగా ఉంటాయని , పోలీసులు దీనిపై ఎలాంటి ఒత్తిడి లకు లోను కాకుండా చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బద్రునాయక్ , ఐక్య వేదిక ముఖ్య సలహాదారులు , రిటైర్డ్ సీఐ పుల్లూరి నాగయ్య , వివిధ ప్రజా సంఘాలు , మహిళా సంఘాల నాయకులు పద్మ, దినకుమారి , ఉష , ఝాన్సీ , చందు , కృష్ణవేణి, సుశీల బాయ్ , స్వాతి , రవీందర్ నాయక్ , వీరన్న నాయక్ పాల్గొన్నారు .