Telugu News

సీఎం ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ నేతల పూజలు 

హాజరైన ఖమ్మం నగరమేయర్, డీసీసీబీ చైర్మన్, సుడా చైర్మన్ 

0

సీఎం ఆరోగ్యంగా ఉండాలని టీఆర్ఎస్ నేతల పూజలు 

== హాజరైన ఖమ్మం నగరమేయర్, డీసీసీబీ చైర్మన్, సుడా చైర్మన్ 

(ఖమ్మం-విజయంన్యూస్);-

సీఎం కేసీఆర్ దైవ అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యముగా ప్రజాక్షేత్రంలో రావాలని టిఆర్ఎస్ పార్టీ  నాయకులు ఆకాంక్షించారు. తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఖమ్మం నగరంలోని 14 డివిజన్ లోని సాయిబాబా దేవాలయం నందు తెరాస నాయకులు,పార్టి శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు ఆరోగ్య సిద్ధిచేకూరాల‌ని, ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని దేవుని ప్రార్థించారు.

also read :-రేపు శ్రీలంకతో చివరి రెండో టెస్ట్‌

ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కురకూల నాగభూషణం,  సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, తెరాస నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మంత్రి పీఏ రవికిరణ్, కార్పొరేటర్ వలరాజు, సుడా డైరెక్టర్ కిషోర్ బాబు, బీసీ సెల్ అధ్యక్షులు మేకల సుగుణరావు, ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేష్, నగర కమిటీ సభ్యులు మరియు నాయకులు సైదా రావు, డౌలే సాయికిరణ్, ఉస్మాన్, గోపాల్,డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..