Telugu News

మద్యం మత్తులో ఆటో డ్రైవర్ కారు డి.

కామేపల్లి - విజయం న్యూస్

0

మద్యం మత్తులో ఆటో డ్రైవర్ కారు డి

మద్యం మత్తు, అతివేగంతో ఆటో డ్రైవర్
తన వాహనాన్ని వేగంగా నడుపుతూ
ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది దీంతో కారు
ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.

(కామేపల్లి – విజయం న్యూస్):- 

ఈ సంఘటనకు సంబంధించిన కామేపల్లి కామేపల్లి ఎస్సై బి. లక్ష్మీ భార్గవి
తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం రేచర్ల నరసయ్య ఏపీ 20 ఏ డి 21 21 నంబర్ల గల తన కారులో ఖమ్మం నుండి ఇల్లందు వెళ్తుండగా కొత్త లింగాల క్రాస్ రోడ్ సమీపంలో ఎదురుగా టీఎస్ 28 జే ఏ 27 46 గల ఆటో అతివేగంగా వచ్చి కారును ఢీకొన్నది.
పాల్వంచ కు చెందిన ఆటో డ్రైవర్
అమర్లపూడి పెద్దిరాజు అజాగ్రత్త, మద్యం మత్తులో అతివేగంగా ఆటోను నడపటం వల్ల తన కారు ధ్వంసం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ రేచర్ల నరసయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

also read :- తిరుపతి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. ముగ్గురికీ గాయాలు