ఆటో డ్రైవర్ నిజాయితీని అభినందించిన ట్రాఫిక్ సీఐ అంజలి .
ఆటో డ్రైవర్ నిజాయితీని అభినందించిన ట్రాఫిక్ సీఐ అంజలి .
ఆటో డ్రైవర్ నిజాయితీని అభినందించిన ట్రాఫిక్ సీఐ అంజలి .
ఖమ్మం : నగరంలో పాత బస్టాండ్ వద్ద ( టీ.ఆర్.ఎస్.కె.వి – టి.ఏ.టీ.యూ ) రవి స్వీట్ ఆటో స్టాండ్ అడ్డా నందు ఆటో డ్రైవర్ శ్రీకాంతు ప్రయాణికురాలు కొర్లపటి నాగమణి ని తన ఆటోలో ఎక్కించుకుని రవి స్వీట్ ఆటో అడ్డా నుండి ముస్తఫానగర్ సెయింట్ మేరీస్ స్కూల్ వద్ద ఆ మహిళ ఆటో దిగి తన బ్యాగ్ ను మర్చిపోయింది . ఆ బ్యాగ్ లో సుమారు (150000/- ) లక్ష యాబయ్ వేలు విలువ చేసే బంగారు గొలుసు దానితో పాటు 400/- రూపాయలు నగదు ఉన్నాయని వెంటనే ఆ బ్యాగును ట్రాఫిక్ సీఐ అంజలీ మేడంకు అప్పగించగా వారు బాధితులకు అందించడం జరిగిందని తెలిపారు .
also read :-ఖమ్మం నగరంలో ఫీవర్ సర్వే ప్రారంభం
సీఐ అంజలీ మేడం ఆటో డ్రైవర్ శ్రీకాంత్ ను , ( టీ.ఆర్.ఎస్.కె.వి – టి.ఏ.టీ.యూ ) జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ ను అభినందించారు . ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ మధార్ , ఏ.ఎస్.ఐ నాగేశ్వరరావు ,( టీ.ఆర్.ఎస్.కె.వి – టి.ఏ.టీ.యూ ) కార్యదర్శి వేమ సెల్వరాజు , రవి స్వీట్ అడ్డా వైస్ ప్రసిడెంట్ యాకూబ్ , ఆటో కార్మికులు పాల్గొన్నారు.