Telugu News

పువ్వాడ పై అసత్య ప్రచారం మానండి

కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ 

0

పువ్వాడ పై అసత్య ప్రచారం మానండి

== ఎవరిపై దాడి చేయాల్సిన అవసరం మాజీ మంత్రికి లేదు

== కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ 

== మాజీ మంత్రి పువ్వాడ పై చేసిన ఆరోపణలను ఖండించిన BRS నేతలు..

(ఖమ్మం -విజయం న్యూస్)

ఒక ప్రధాన పత్రికలో వచ్చిన నిరాధారమైన వార్త ను చూపిస్తూ ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పై ఎన్నికల సమయంలో దాడి చేయడానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్ర పన్నారని నిరాధారమైన ఆరోపణలను BRS నేతలు తీవ్రంగా ఖండించారు.

ఇది కూడా చదవండి:- ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం: పువ్వాడ 

శనివారం BRS జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజి డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ మక్బూల్, దండా జ్యోతి రెడ్డి, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు తాజ్ఉద్దీన్, ఉద్యమకారుడు బొమ్మెర రాంమూర్తి, నరేందర్, లీగల్ సెల్ నాయకుడు మేకల సుగుణ రావు తీవ్రంగా ఖండించారు.

తుమ్మల పై దాడి చెసే అవసరం మాకు లేదు. అబద్ధాలను నిజం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు.

గత ఎన్నికలలో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చలేదు.. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి తోచని స్థితిలో ఆయా అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ నేతల ఆరోపణలు.

హామీలు నెరవేర్చకుండా ప్రజలముందుకు ఎలా వస్తారు.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కుయొక్తులు పన్నుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు.

పువ్వాడ కుటుంబం 5దశాబ్దాలుగా ప్రజల మన్ననలను పొందుతుంది. వారి కుటుంబం తెరిచిన పుస్తకం.

మాజీ మంత్రి పువ్వాడ కుటుంబంపై ప్రత్యర్థులు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

రాజు మెప్పు పొందేందుకే వెనక ఉండే సామంతుల లాగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు.

పువ్వాడ ను ఎదుర్కునే శక్తిలేక పాలేరులో పోటీ చేసిన వ్యక్తిని బరిలోకిదించారు.

ఓ ప్రధాన పత్రికలో వచ్చిన నిరాధారమైన వార్తను పట్టుకుని కాంగ్రెస్ నాయకులు పువ్వాడపై తప్పుడు ఆరోపణలు చెస్తున్నారు.

ఈ ఆరోపణలపై మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా. ఉంటే మీడియా ముందు పెట్టండి.. ప్రజలకు తెలియచేయండి.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత సమస్యల గురించి మాట్లాడండి.

*▪️మేయర్ పునుకొల్లు నీరజ కామెంట్స్..*

మాజీ మంత్రి పువ్వాడ పై ఆరోపణలు చేయడం సారికాదు.

తుమ్మల ను చంపడం వల్ల ఈ ఎన్నికల్లో ఎవరికి లాభం జరుగుతుంది.

అటువంటి హత్య రాజకీయాలు పువ్వాడ అజయ్ కు అవసరం లేదు. వారి కుటుంబం 50ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నారు.

జిల్లాలో కడప, రాయలసీమ హత్య రాజకీయాలకు అవకాశం లేదు.

అధికారంలో మిరే ఉన్నారు…. పోలీసులతో పటిష్ట విచారణ చేసి చర్యలు తీసుకోండి.

అనవసరంగా పువ్వాడ పై ఆరోపణలు చేయడం సరికాదు…. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.

*▪️మాజీ డివిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం కామెంట్స్..*

మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయటానికి…. ప్రతిపక్ష పార్టీ నాయకులు పై ఆరోపణలు చేయడానికి కాదు.

మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి… చేసి మంచి పేరు తెచ్చుకోండి.

రెచ్చగొట్టే రాజకీయాలు చేయకండి. మీకే మంచిది కాదు.

*▪️BRS టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు కామెంట్స్..*

కాంగ్రెస్ కార్పొరేటర్లు కొంతమంది మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్నారు.

పువ్వాడ కు తుమ్మల నాగేశ్వరరావు పై దాడి చేయించాల్సిన అవసరం ఏముంది.

పాలేరులో పోటీ చేసే వ్యక్తి నీ ఖమ్మంలో తిసుకొచ్చి పోటీ చేపించారు.

ఒక ప్రధాన పత్రికలలో వచ్చిన వార్తను పట్టుకొని పువ్వాడ పై ఆరోపణలు చేయడం సరికాదు.

ఆ ఆరోపణలకు సంబంధించి మీ దెగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి. చూపించాలి. పేపర్లో రాపించి అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు.

మొన్న జరిగిన ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక ప్రజలను పక్క దారి పట్టించడానికే ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఫస్ట్ అమలు చేయండి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదిస్తున్నారు.

పువ్వాడ కుటుంబం 5దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు…..వారి గురించి తెరిచిన పుస్తకం. గత ఎన్నికల్లో కూడా ఇటువంటి అసత్యాలు ప్రచారం చేసి గెలిచారు.

ప్రత్యర్థుల మీద ఆరోపణలు సృష్టిస్తు రాజకీయం చేయడం సరికాదు.

ఇటువంటి రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాము.