Telugu News

10 వ తరగతి టాపర్ ఎండి ఆఫియా కు సన్మానం

మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్ష

0

10 వ తరగతి టాపర్ ఎండి ఆఫియా కు సన్మానం

== మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్ష

చండ్రుగొండ ఏప్రిల్ 30 (విజయం న్యూస్) :-

ఇటీవల ప్రకటించిన పది ఫలితాలలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9.5 మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థిని ఎండి .ఆఫీయా ను జమాతే ఇస్లామి హింద్ మరియు మైనారిటీ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ బాధ్యులు మాట్లాడుతూ ఈ సమాజంలో విద్య లేనిదే మనుగుడా లేదని, సమాజంలో ప్రతి ఒక్కరికి చదువు అవసరమని, మనం కూడా నిరుపేదల్లో చదువుకునే విద్యార్థులకు అండ గావుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో,మౌలాలి ఖాజా హుస్సేన్ వాహేద్ అష్రఫ్ మరియు కాంగ్రెస్ మండల మైనారిటీ అధ్యక్షులు అన్వర్ ఉపాఢ్యక్షులు యాకూబ్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ నియోజకవర్గ సెక్రెటరీ ఫజల్ బక్ష్ పార్టీ నాయకులు అసిఫ్ అజీజ్ సయీద్ జవేద్ రబ్బానీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు