Telugu News

ఖమ్మం లో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నామినేషన్..ఎవరంటే..?*

రెబల్ అభ్యర్థి గా  షేక్ బాజీ బాబా నామినేషన్ దాఖలు

0

ఖమ్మం లో బి.అర్.ఎస్  ఎదురుదెబ్బ

== రెబల్ అభ్యర్థి గా  షేక్ బాజీ బాబా నామినేషన్ దాఖలు

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇటీవలే కొత్తగూడెం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీని విడిగా, రెండు రోజుల క్రితం వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ రాజీనామా చేశారు. ఆ తరువాత మూలిగే నక్క పై తాటిపండు పడినట్లు పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ రెబల్  అభ్యర్థిగా యువజన నాయకుడు నామినేషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం రేసులో RRR..?

బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ బాజీ బాబా ఎంబీఏ వరకు విద్యాభ్యాసం చేశారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బాజీ బాబా రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు గతంలో కొనసాగారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన మళ్లీ అదే పార్టీలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటికే రెండు పర్యాయాలుగా కొనసాగుతున్నారు.ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించిన
షేక్ బాజీ బాబా ఖమ్మం పట్టణంలో నివాసం ఉంటున్నారు.
భార్య గృహిణి షేక్ షాహిన్, కుమార్తె షేక్ సుమయ ఉన్నారు.

టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న విద్యార్థి సంఘ నేత షేక్ బాజీ బాబా పలు ఉద్యమాలలో నాటి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.విద్యార్థుల పక్షాన నిలిచి పోరాటాలు చేసి పోలీసు లాటి దెబ్బలను రుచి చూశారు.

ఇది కూడా చదవండి:- పువ్వాడ పై అసత్య ప్రచారం మానండి

కాగా ఖమ్మం ఎంపీ సీటు స్థానాన్ని మైనార్టీలకు ఇవ్వాలని ఆయన ఖమ్మంలో ఒక సమావేశాన్ని నిర్వహించి జిల్లా పార్టీ దృష్టికి అదే విధంగా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో ఒక స్థానాన్ని కూడా ముస్లింలకు కేటాయించలేదని దీనిని తమ అవమానంగా భరిస్తున్నామని కేవలంతమని ఓటు బ్యాంకు రాజకీయంగా మాత్రమే చూస్తున్నారని అందుకే తాము తమకున్న బలాన్ని నిరూపించుకోవడం కోసమే నామినేషన్ వేస్తున్నామని ఆయన అన్నారు. తనకు బీసీ,ఎస్సీ ఎస్టీ, తన జాతి ముస్లిం సోదరుల మద్దతు పూర్తిగా ఉందని ఆయన అన్నారు.