Telugu News

బాబు నీ రుబాబు ఇక్కడ నడవది: మంత్రి పువ్వాడ

ఖమ్మంని అభివృద్ధి కి ఐకాన్ గా నిలిపింది సీఎం కేసీఆర్

0

బాబు తెలంగాణలో నీ రుబాబు నడవదు

== ఖమ్మంని అభివృద్ధి కి ఐకాన్ గా నిలిపింది సీఎం కేసీఆర్

== మెడికల్ కాలేజీ నా కష్టార్జితం

== నా డబ్బుతో పెట్టుకున్న కాలేజీని నువ్వు పెట్టిచ్చావా..?  

== చంద్రబాబు నాయుడిపై మండిపడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== చంద్రబాబు ఖమ్మం సభలో కుటీల బుద్ధిని కపట నీతిని ప్రదర్శించారు

== ఏ మొహం పెట్టుకొని ఖమ్మం లో సభ పెట్టావో చెప్పాలి

== తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసిన బాబు పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు మళ్ళీ బయలుదేరాడు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ ఏర్పడిన తొలి రోజు నుంచి చంద్రబాబు కుట్ర బుద్ధులు బయటపడ్డాయని, బాబు నీ రుబాబు తెలంగాణలో నడవదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంపై ఎదో ఒక రకమైన అబద్దాలు మాట్లాడుతున్న చంద్రబాబు ఖమ్మం జిల్లాను అభివృద్ధి  చేసింది నేనే అని చెప్పుకోవడం దుర్మార్గమని, ఖమ్మంని అభివృద్ధి కి ఐకాన్ గా నిలిపింది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాటలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: తెలంగాణకు తెలుగుదేశం అవసరం: చంద్రబాబు

హైదరాబాద లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో మెడికల్ కళాశాలను నేనే పెట్టించానని చంద్రబాబు నాయుడు చెప్పడం హస్యాస్పదమన్నారు. ఖమ్మంలో మెడికల్ కాలేజీ నా కష్టార్జితంతో కట్టుకుందని, నా డబ్బుతో నేను పెట్టుకున్నానని అన్నారు. ఇంతటి అబద్దాల కోరును నేనేప్పుడు చూడలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఖమ్మం సభలో కుటీల బుద్ధిని కపట నీతిని ప్రదర్శించారని ఆరోపించారు. ఏ మొహం పెట్టుకొని ఖమ్మం లో సభ పెట్టావో ప్రజలకు చెప్పగలవా..? అని అన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసిన బాబు పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు మళ్ళీ బయలుదేరాడని ఆరోపించారు. పోలవరానికి ఏడు తెలంగాణ మండలాలను చంద్రబాబు మోడీ మోహర్బానీతో గుంజుకుని ఖమ్మంలో గురువింద గింజల మాట్లాడుతున్నాడని అన్నారు. వ్యవసాయం దండగ అని నా అన్నోడే తెలంగాణలో ఆ ప్రాజెక్టు కట్టాం ఈ ప్రాజెక్టు కట్టామంటూ కట్టుకథలు చెబుతున్నారని ద్వజమెత్తారు. రైతులను నిర్లక్ష్యం చేసి మేము ఓడిపోయామని 2004 ఓటమి తర్వాత చేసిన ప్రకటన చంద్రబాబు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతుల అవమానపరిచిన వాడు నేడు ముసలి కన్నీరు ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. బషీర్బాగ్లో కరెంట్ చార్జీలు తగ్గించాలన్న రైతులపై కాల్పులు జరిపించి ముగ్గుని బలిగొన్నది నువ్వు కాదా బాబు అంటూ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ను చూస్తే బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది: కూరపాటి

నీ అవకాశవాద రాజకీయాలు ఏపీలో ప్రదర్శించుకో తెలంగాణలో కాదు అంటూ సూచించారు. 2018లో మహాకూటమి పేరుతో తెలంగాణను వసం చేసుకోవాలి కుట్ర పన్నితే ప్రజలు ఏకమై చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు నాలుగేళ్లయినా కాలేదు మళ్ళీ గుంట నక్కల ఖమ్మం నుంచి కుట్రకు తెరలేపారని

నక్కజిత్తుల నారా బాబు తెలంగాణలో నీ రుబాబు నడవదు అని ద్వజమెత్తారు. నువ్వు స్టేట్స్ మాన్ కాదు సేల్స్ మ్యాన్ అని అందరికి తెలుసని దుయ్యబట్టారు. బిజెపితో ఏపీలో పొత్తుకు తెలంగాణలో నాటకాలు వేస్తున్నావని, ఖమ్మం లాంటి సభలు ఎన్ని పెట్టిన చంద్రబాబు శ్రమ వృధాయే అని సూచించారు. తెలంగాణలో పడే కష్టమేదో ఏపీలో పడితే నాలుగోట్లైనా పెరుగుతాయిని అన్నారు. తెలంగాణలో బాబు కాళ్లకు బల్పం కట్టుకొని తిరిగిన చిల్లుపడ్డ కొండలు నీళ్లు పోసినట్టే తప్ప ఒరిగేది ఏమీ లేదన్నారు. బిజెపి షర్మిల ప్రయోగం ఫెయిల్ అయిందని బాబును పంపినట్టు అర్థమవుతుందని అన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం  రోటరీనగర్ లో క్షుద్రపూజలు

ఏపీలో చెల్లని నాణెం..తెలంగాణలో చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. తన వల్లే ఖమ్మం అభివృద్ధి చెందింది అంటుండట హాస్యస్పదమేనన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. ఖమ్మం జిల్లా కు తెలంగాణకు చంద్రబాబు వల్లే మొదటిగా నష్టం, అన్యాయం జరిగిందన్నారు. పోలవరానికి ఏడు మండలాలు గుంజుకున్నది చంద్రబాబు కాదా..? 440 మెగావాట్ల సీలేరు జల విద్యుత్ కేంద్రం ఏపీకి దక్కించుకుంది చంద్రబాబు కాదా..?అని ప్రశ్నించారు. ఖమ్మంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ కట్టా అని చంద్రబాబు నిరూపిస్తే నేను ముక్కు నేల కు రాస్తా అని ప్రశ్నించారు.  కేసీఆర్ వల్లే ఖమ్మంకు జల వైభవం వచ్చిందన్నారు. ఖమ్మంకు ఐటీ తెచ్చింది కేసీఆర్, కేటీఆర్ లే అని,  మేము కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలు కోరుతున్నారని అన్నారు. మమ్మల్ని మళ్ళీ ఆగం చేయొద్దు బాబు. ఎన్టీఆర్ పట్ల బాబు కన్నా కూడా కేసీఆర్ కే ఎక్కువ ప్రేమ ఉందని అన్నారు.  చంద్రబాబు హాయంలో ఖమ్మం కు బుడ్డ పైసా పని రాలేదు, పనులు కాలేదన్నారు. ఖమ్మం కరకట్ట చంద్రబాబు పూర్తి చేసుంటే మొన్న భద్రాచలంలో వరదలు వచ్చేవా..? అని అన్నారు.  చంద్రబాబు సభ పెట్టిన గ్రౌండ్ చాలా చిన్నది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనాలను తరలించారు. నాడు తెలంగాణ పదాన్ని నిషేధించిన వ్యక్తి చంద్రబాబు.

ఇది కూడా చదవండి: ప్రజలకు మరింత చేరువగా మంత్రి పువ్వాడ

చంద్రబాబు నాడు ఉద్యోగులను రాచి రాంపాన పెట్టాడు. నిరుద్యోగుల పొట్ట కొట్టింది చంద్రబాబే అంటూ మండిపడ్డారు. పాలమూరు పేరు చెప్పుకుని ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. తెలంగాణ వాదాన్ని అణచి వేసింది బాబు కాదా..? అని ప్రశ్నాంచారు. అంగన్ వాడీ వర్కర్ల ను గుర్రాలతో తొక్కించింది బాబు కాదా..? బాబు నిన్న కూడా జై తెలంగాణ అనలేదని స్పష్టం చేశారు. బాబు ను చూస్తే పంచతంత్ర లోని పులి బాట సారి బంగారు కడియం  కథ గుర్తొస్తోందని అన్నారు. పులి చేతిలో మోసపోయే బాటసారి కాదు నేటి తెలంగాణ తెలిపారు. కేసీఆర్ ను ఎదుర్కునేందుకు బీజేపీ రకరకాల ప్రయోగాలు చేస్తోంది ..ఇపుడు బీజేపీ పంపుతున్న  నేతల జాబితా లో చంద్రబాబు చేరిపోయాడు ఆరోపించారు.