Telugu News

‘తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు. వెనుకబాటుకు గురైన ప్రాంతం.

స్వరాష్ట్రమైతే దేశంలోనే తెలంగాణ ధనికరాష్ట్రం అవుతుంది’

0

‘తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు. వెనుకబాటుకు గురైన ప్రాంతం.

==స్వరాష్ట్రమైతే దేశంలోనే తెలంగాణ ధనికరాష్ట్రం అవుతుంది’

==ఉద్యమ సమ యంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేయటానికి కేసీఆర్‌ చెప్పిన మాట ఇది.

(విజయం న్యూస్ తెలంగాణ ):-

ఆ మాట అక్షరసత్యమని నిరూపితమైంది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన వివరాలు తాజాగా ఇదే విషయాన్ని చాటిచెప్పాయి. దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకి 14.7 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలువటం, తలసరి ఆదాయంలో రూ.2,78,833తో పెద్ద రాష్ర్టాల్లో అగ్రభాగాన ఉండటం హర్షణీయం. ఇతర రాష్ర్టాలతోనే కాదు.. తెలంగాణ తనతో తానే పోటీ పడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తలసరి ఆదాయంలో 18.78 శాతం వృద్ధిని సాధించింది.

రాష్ట్రంగా కళ్లు తెరువకముందు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులతో పోల్చిచూస్తే గానీ ఈ విజయాలు ఎంత మహత్తరమైనవో అర్థం కావు. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 2014-15లో తెలంగాణ ప్రాంత వృద్ధిరేటు మైనస్‌ 0.7 శాతం. అంటే నాడు తెలంగాణలో వ్యవసాయం రోజురోజుకీ కుంచించుకుపోయిన దైన్యం. అటువంటి పరిస్థితి నేడు సమూలంగా మారిపోయింది. 2020-21 నాటికి వ్యవసాయ వృద్ధిరేటు 18.5 శాతానికి పెరిగింది.

also read :-తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

దేశానికే అన్నపూర్ణగా భాసిల్లిన పంజాబ్‌తోనే పోటీ పడే స్థాయికి తెలంగాణ చేరుకున్నది. మరో కీలకమైన పారిశ్రామికరంగంలో నాడు కరెంటు లేక కర్మాగారాలను మూసివేసుకునే పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా, ప్రభుత్వ అనుమతుల మంజూరులో వేగం, మౌలిక సౌకర్యాల కల్పన కారణంగా.. పారిశ్రామిక ఉత్పత్తుల స్థూల విలువ 60 శాతం పెరిగింది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగంలో ఎగుమతులు 2014-15లో రూ.66,276 కోట్లు ఉండగా, ప్రస్తుతం అవి లక్షన్నర కోట్ల రూపాయలు దాటాయి. వీటన్నింటి ఫలితంగానే నాడు రూ.1.24 లక్షలున్న తలసరి ఆదాయం నేడు రెట్టింపుకన్నా ఎక్కువగా పెరిగింది.

also read :-బ‌స్సు సౌక‌ర్యం కోరిన రామ‌రాజుప‌ల్లి గ్రామ‌స్థులు, విద్యార్థులు.

ఇదంతా కేవలం ఏడేండ్లలో జరిగిన మార్పు అంటే నమ్మశక్యం కాని విషయం. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అసాధ్యాలు కూడా సుసాధ్యమయ్యాయి. అభివృద్ధికి సంబంధించి కొత్త దృక్కోణం, దిశానిర్దేశం, ఖర్చుకు వెరువకుండా నిధుల కేటాయిం పు, చిత్తశుద్ధితో అమలు. మిషన్‌ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వ్యవసాయరంగంలో విప్లవాన్ని సృష్టిస్తే.. టీఎస్‌ ఐపాస్‌ వంటి వినూత్న పథకాలు పారిశ్రామిక రంగంలో అనుకూల పరిస్థితులను నెలకొల్పాయి. వీటన్నింటికీతోడు.. శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం రాష్ట్రంలో పూర్తి భద్రతతో కూడి న వాతావరణాన్ని సృష్టించింది. ఈ సమగ్ర వ్యూహం ఫలితంగానే.. దేశంలో అతి పిన్న వయస్కురాలైన తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద విజయాల్ని సాధించి యావత్‌దేశాన్ని అబ్బురపరుస్తున్నది. తెలంగాణ విజయయాత్ర ఇలాగే కొనసాగాలి.