అబార్షన్ వికటించి యువతి మృతి
★★ భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సంఘటన
(భద్రాచలం, విజయంన్యూస్)
ఆసుపత్రిలోఓ డాక్టర్ కక్కుర్తికి ఓ నిండుప్రాణంబలైంది.. ఒక వైటు అబార్షన్ చట్ట విరూద్దం, క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం మొత్తుకుంటున్న ప్రభుత్వం.మాటలు.. పోలీసుల హెచ్చరికలు కొంత మంది డబ్బు సంపాధనే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్లకు వినిపించడంలేదు. కూసింత డబ్బులకు ఆశపడిన డాక్టర్ చేసిన నిర్వాహకానికి యువతి చనిపోయిన పరిస్థితి ఏర్పడింది.
Allso read:- ఇసుక క్వారీల్లో జీరో దందా….
ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఈ సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే ములకలపల్లి మండలం వి .కే రామవరం గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ అమ్మాయిని ఓ యువకుడు ట్రాప్ చేసి గర్భవతి చేశాడు..భద్రాచలం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆబార్షన్ చేయించడం కొరకు ఆ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. డాక్టర్ తో పైసలు మాట్లాడుకున్న ఆ యువకుడు గుట్టు చప్పుడుకాకుండా అబార్షన్ చేయించాలని చూశాడు. అతి ఆశకు పోయిన డాక్టర్ 5 నెలల గర్భవతి అయిన ఆ యువతికి ఆబార్షన్ చేయడంతో అబార్షన్ వికటించి అమ్మాయి పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల నిర్లక్షంతో యువతి మృతి చెందింది. కాగా సమాచారం తెలుసుకున్న యువకుడు ఫరార్.. అవ్వగా, ఆసుపత్రి సిబ్బంది అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో హాటాహుటిన అమ్మాయి తల్లిదండ్రులు హాస్పిటల్ కి చేరుకొని ఇవ్వడం 100 కి కాల్ చేసి సమాచారం పోలీసులకు అందజేశారు. కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు….