నిలకడగా గోదావరి ఉదృతి
★★ 52.90కి తగ్గిన వరద ప్రవాహం
★★ మూడవ ప్రమాద హెచ్చరిక రద్దు
భద్రాచలం, జులై12(విజయం న్యూస్):-
భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ప్రవహాం కొనసాగుతున్నది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు నిన్న రాత్రి వరకు భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతూ 53.90అడుగులకు చేరగా,అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. కానీ మంగళవారం తెల్లవారుజామున క్రమెపీ వరద ఉధృత్తి తగ్గుముఖం పట్టింది.
Allso read:- మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ పోన్
ఉదయం 10గంటల నాటికి 52అడుగులకు తగ్గింది. మూడవ ప్రమాద హెచ్చరికను అధికారులు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఏజెన్సీ ప్రజలు, అధికారులు కొంత ఊపిరిపిల్చుకుంటున్నారు. అయితే అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు వరద నీటి ఉదృత్తిని పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులు లోతట్టులో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికికావాల్సిన సౌకర్యాలను అందజేస్తున్నారు.