Telugu News

*భద్రాచలంలో సీఎం కేసీఆర్ పర్యటన*

రూ.1000కోట్లు ప్రకటించిన సఔఎం

0

*భద్రాచలంలో పర్యటించిన సీఎం కేసీఆర్*

*గోదావరి బ్రిడ్జిపై నిలబడి గోదావరి వరద పరిస్థితిని పరిశీలించిన కేసీఆర్*

*వరద పరిస్థితిని వివరించిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్*

*సీఎంతో మంత్రులు హారీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరర్ రెడ్డి హాజరు*

పెండ్ర అంజయ్య, భద్రాచలం, జులై 17(విజయంన్యూస్)

ముఖ్య‌మంత్రి కేసీఆర్ భ‌ద్రాచ‌లం చేరుకున్నారు. ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి న‌దికి సీఎం కేసీఆర్ శాంతి పూజ నిర్వ‌హించారు. వంతెన పైనుంచి గోదావ‌రి ప‌రిస‌రాల‌ను సీఎం ప‌రిశీలించారు.

Allso read:- గవర్నర్ న్ను నిలదీసిన బాధితలు

భద్రాచలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు మాట్లాడిన వివరాలు ఇలా
• గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యాయి.
• వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
• ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ప్రశంసనీయం
• మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లను, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు

Allso read:- శాంతిస్తున్న గోదావరి
• భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం.
• వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తాం
• ఎత్తైన స్థలాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత కాలనీలను నిర్మించాలి : కలెక్టర్ ను ఆదేశించిన సీఎం
• భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలి.
• కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలి.
• బాధితులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలి.
• శాశ్వత పరిష్కారం కోసం వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నాం : సీఎం కేసీఆర్
• ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్ చేయింలి : హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావుకు సీఎం కేసీఆర్ ఆదేశం
• ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులను అందజేస్తాం
• ఖమ్మం జిల్లా కలెక్టర్ సహా సీనియర్ అధికారులను భద్రాచలం రప్పించాలి
• రాముల వారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతాం
• భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తాం
• ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తా : సీఎం కేసీఆర్
• సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం
• ఇంకా వర్షాల ముప్పు పోలేదు. ఈ నెలాఖరుదాకా వానలు కొనసాగుతాయి.
• మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరస్ట్ లు జరుగుతున్నాయి
• పర్యవసానంగా వరద ముంపు పెరుగుతున్నది
• నిరంతరాయంగా కురిసే వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి నిదర్శనమే ఈ వరదలు
• కడెం ప్రాజెక్టు దేవుని దయ వల్ల నిలబడింది.
• ఈ ప్రాజెక్టుకు నీటి వరద 2 లక్షల 90 వేల క్యూసెక్కులకు మించి దాటలేదు.
• కానీ ఇపుడు 5 లక్షలకు మించి పోయినా ప్రాజెక్టు నిలబడింది.
• వాగులు వంకలు పొంగుతున్నయి, చెరువులు, కుంటలు నిండినయి.
• వానలు తగ్గినయని ప్రజలు అలక్ష్యం వహించవద్దు.
• దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదలకు సంబంధించిన అంశాలు నా దృష్టికి వచ్చాయి.
• మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తాం.
• బాధితులు ఎత్తైన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులొచ్చాయి
• భద్రాచలం, బూర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో పలు గ్రామాల్లో వరద సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
• రైతుల పంటలు నీట మునిగాయి. సమీక్షించి తగు సహాయం అందిస్తాం
• పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే ఖాళీ చేయించాలి.
• ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తాం.
• వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేస్తాం
• ప్రజలంతా మరో 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. రిలాక్స్ కాకూడదు. అలర్ట్ గా ఉండాలి.
• హైదరాబాద్ నుంచి మేం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ప్రజలను వరదల నుంచి రక్షించి, ప్రాణహాని జరగకుండా కాపాడిన వారందరికీ అభినందనలు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వతి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిస్తారు. ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

ALLSO READ- గవర్నర్ న్ను నిలదీసిన బాధితలు