Telugu News

ఉప్పొంగుతున్న గోదావరి

48అడుగులు దాటిన గోదావరి ఉదృతి

0

ఉప్పొంగుతున్న గోదావరి

** 48అడుగులు దాటిన గోదావరి ఉదృతి

** *రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

భద్రాచలం, జులై 11(విజయంన్యూస్)

గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది.. ఎగువ నుంచి వస్తున్న వరదలకు భద్రాచలంలో గోదావరి ఉదృతి మరింత పెరిగింది. సోమవారం ఉదయం 6గంటల సమయానికి 48 అడుగులకంటే ఎక్కువగా వరద ఉదృతి పెరిగింది. దీంతో సంబంధిత అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూడవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది.. గడిచిన నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది.. పెద్ద ప్రాజెక్టులు, మద్యతరహ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాయి.

allso read- వర్షాలు పడుతున్నాయ్.. జాగ్రత్తగా ఉండండి: సీఎం కేసీఆర్

చిన్నతరహా ప్రాజెక్టులు పొంగిపోర్లుతున్నాయి.. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, తాళిపేరు, వైరా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉదృతికి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం వద్ద గోదావరమ్మ పరుగులు పెడుతోంది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే 48 అడుగులు దాటిన గోదావరి మరో 10 అడుగుల పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమైయ్యారు. లోతట్టులో ఉన్న అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్లులో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రత్యేక బ్రుందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక వరదలకు సంబందించిన విషయంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండగా, డీజీపీ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. భద్రాచలం విషయంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతిరాథోడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, కవిత, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినిత్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మండల స్థాయి, అధికారులకు పోన్లు చేసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు… ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో భయాందోళన చెందుతున్నారు.

allso read- పోటెత్తిన గోదావరి.. అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి