Telugu News

ఆశలు అడి ఆశలేనా..?

రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు

0

ఆశలు అడి ఆశలేనా..?

★ రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు

★ పట్టు సాధించి సత్తా చాటేదేవరు..?

★ అసంతృప్తి నేతల పైనమేటో..?

★ రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ గట్టెక్కేనా….?

★ నేతలను కలవర పెడుతున్న సర్వేల భయం.

★ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి పట్టు ఎంత…?

★ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి చుక్కెదురేనా…?

★ ఎమ్మెల్యేల విజయం పై నీలి నీడలు

రిపోర్టర్ : చామంచుల క్రిష్ణ

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, ఆగస్టు 2(విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అనేక సార్లు సర్వే చేయిస్తున్నారు.. ప్రతి ఆరు నెలలకోకసారి సర్వే టీమ్స్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి ఎప్పటికప్పడు ఎమ్మెల్యేల పనితీరును సర్వే చేసి సీఎం కేసీఆర్ కు రిపోర్ట్ ఇస్తున్నారు.. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సర్వే గుబులు పట్టుకుంది.. ఎవరి జాతకం ఏంటో ఆ సర్వేలో తెలతుందనే భయంతో వణికిపోతున్నారు… టిక్కెట్ భవిష్యత్ సర్వే పై ఆధారపడి ఉండటంతో ఆ ఎమ్మెల్యేలు క్షణంక్షణం భయపడుతూ పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది..  ఏ క్షణాల్లో తమపై రాంగ్ రిపోర్టు వస్తుందోననే భయంతో ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటన చేస్తున్నారు. ప్రజలతో సంబందాలు పెట్టుకుంటున్నారు. ప్రజల్లో ఉంటున్నారు. అమ్మయ్యా పర్వాలేదులే అనుకుంటున్నలోపై  సర్వే రిపోర్టు మాత్రం అందుకు భిన్నంగా వస్తున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పై సర్వే రిపోర్ట్ లో వ్యతిరేకంగా వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి :- ‘వీఆర్ఓ’ కథ ముగిసినట్లే

రానున్న శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొత్తగూడెం, పినపాక ,ఇల్లందు ,అశ్వరావుపేట, ఎమ్మెల్యేలు ఘోర పారాజయాన్ని చవిచూడనున్నారని వరస సర్వేల సారాంశం స్పష్టమవుతుంది. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలలో ఓటమి భయం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మరోపక్క ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులు సాగిస్తున్న అక్రమ ఇసుక దందా ప్రభుత్వ భూముల కబ్జాతో దళిత కుటుంబాలలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందకుండా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే పంపిణీ చేస్తూ వారి వద్ద నుండి ఎమ్మెల్యే ల అనుచరులు లక్షలాది రూపాయలను ముడుపులుగా దండుకుంటున్నారని విమర్శలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ లక్ష్యం ” కారిపోగా” ఎన్నో ఏళ్ల పాటు కారుపార్టీనే నమ్ముకున్నా అర్హులైన కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమంలో లాటి తూటాలను ఎదిరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జైలు పాలైన ఉద్యమకారులను సైతం స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించకపోవడం కొసమెరుపు. దీంతో తెలంగాణ ఉద్యమకారులు ఆయా కుల సంఘాల నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏళ్ల తరబడి కుల సంఘాల కోసం దళిత వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన నాయకులను కూడా పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు సూచించిన వారికే జాబితాలో పేరు దక్కడం పై కుల సంఘాల నాయకులు బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ వాదాన్ని ఉద్యమకారులకు సైతం దళిత బందులో చోటు కనిపించకుండా ఎమ్మెల్యేల అనుచరులు సాగిస్తున్న దందాలతో ఎమ్మెల్యేల ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కారు పార్టీకి బలమైన దెబ్బ తగలనుందనేది వరుస సర్వేలు తేటతెల్లమ్ చేస్తున్నాయి.

ఇది కూడ చదవండి: క్వార్టర్ బాటీల్ లో కల్తీ జరిగిందా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఖమ్మం మినహా మరి ఏ ఇతర నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన దాఖలాలు మచ్చుకైన లేవు. ఉద్యమ సమయంలోను గత 2014 , 2018 ఎన్నికల్లో అధికార పార్టీ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులంతా హస్తం పార్టీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓటమి చెంది పరాజయాన్ని మోటాగట్టుకున్నారు. ఏ శాసనసభ ఎన్నికల్లోను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించ లేక చతికల పడ్డారు . కాగా తమ రాజకీయ భవిష్యత్తు అభివృద్ధి పేరుతో హస్తం పార్టీలో గెలిచిన అభ్యర్థులంతా కారు పార్టీలోకి వలస వెళ్లారు దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ బలం పెంచుకున్నప్పటికీ కింద స్థాయి లో ఎటువంటి ప్రజల మద్దతును కూడగట్టుకోలేకపోయిందనేది సర్వత్ర వ్యక్తం అవుతుంది. హస్తం పార్టీ నుంచి వలస వెళ్లిన నేతలంతా తాము అభివృద్ధి చెందారే తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వారికి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా వరద సహాయం పేరుతో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పర్యటించిన పినపాక నియోజకవర్గం లో వరద సహాయం పై నేతలను ప్రజలు నిలదీశారు.

 

వరద సహాయం పై కనీసం సమాచారం అందించకుండా బినామీల పేర్లను చేర్చి అధికార పార్టీ కి చెందిన కార్యకర్తలకే వరద సహాయాన్ని అందించారని తాము కష్టాల్లో ఉంటే కనీసం తమ గ్రామాలను ఇళ్లను సందర్శించకుండా ఓ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించి చేతులు దులుపుకున్నారని ఇదెక్కడి న్యాయమని మహిళలు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఎంపీలను నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అప్పుడు చూస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు. ఇది ఇలా ఉండగా రానున్న ఎన్నికల్లో నాలుగు శాసనసభ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలో వలస వెళ్లిన నేతలకు ఓటమి భయం కలవరపెడుతుంది రానున్న ఎన్నికల్లో వారి ఆశలు గల్లంతెనంటూ వరుస సర్వేల్లో వెళ్లడవుతుంది దీంతో ఆ నేతలకు ఓటమి భయం నుండి ఎలా తప్పించుకోవాలని పునరాలోచనలో పడ్డారు పైకి మాత్రం మేకపోతు గాంబీర్యంతో అడపాదడపా ప్రజలను కలుస్తూ ఫోటోలతో ఫోజులిస్తున్న నేతలకు ప్రజలే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల సమాచారం. కాగా ఆయా నియోజకవర్గాల్లో వలస వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీపై ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో ఆది నుండి పార్టీని నమ్ముకున్నా మాజీ ఎమ్మెల్యేలు ఉద్యమకారులు పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. అధికార టీఆర్ఎస్ లో రగిలిపోతున్న అసమ్మతినేతలంతా మూకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. శనివారం హైదరాబాదులో జరిగిన ఓ మాజీ ఎంపీ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన నేతలంతా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో ఏకాంతంగా చర్చలు జరిపి తమ రాజకీయ భవిష్యత్తుకు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించాలని కోరినట్లు ప్రచారం సాగుతుందనే ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరందుకుంది. రేవంత్ రెడ్డి ఫోటోలతో కూడిన చిత్రాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓ మాజీ ఎంపీ నేతృత్వంలో భారీగా టిఆర్ఎస్ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరెందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం . ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి నుండి గట్టెక్కడం కష్టమేనని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజాక్షేత్రంలో ఓ పార్టీ నుండి మరో పార్టీలోకి వలస వెళ్లి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అనుచరుల దందాను అడ్డుకట్ట వేయకుండా కాలం గడుపుతున్న ఆ ఎమ్మెల్యేలకు ప్రజల నుండి వెల్లువెత్తుతున్న ఆగ్రహ ఆవేశాలతో ఓటమి ఖాయం అనేది ఆయా నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని “ఆనలుగురు” ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనాపటికి జిల్లాలో ఆనలుగురు ఎమ్మెల్యేల అనుచరులు సాగిస్తున్న దందాలతో కారు పార్టీపై పోటీ చేసిన వారు ఓటమి చెంది ఇంటిదారి పట్టటం ఖాయమని ప్రజలు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.