Telugu News

ప్రమాదంలో భద్రాద్రి..?

భద్రాచలానికి వరద ముప్పు..?

0

ప్రమాదంలో భద్రాద్రి..?

== భద్రాచలానికి వరద ముప్పు..?

== 64 అడుగుల నీటిమట్టం దాటే అవకాశం..?

== అప్రమత్తమైన అధికారులు

== ముందస్తు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ

== ఏజెన్సీ గ్రామాలను ముంచే ప్రమాదం..?

== పునరవాస కేంద్రాలను పెంచుతున్న అధికారులు

==  లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న అధికారులు

భద్రాద్రికొత్తగూడెం ప్రతినిధి, భద్రాచలం, జులై 13(విజయంన్యూస్)

భద్రాచలం ప్రమాదంలో పడపోనుందా..? భద్రాద్రి రామయ్యకు వరద ముప్పు రానుందా..? చరిత్రలో 1986ను దాటే అవకాశం ఉందా..?  రాత్రి సమయానికి ఏజెన్సీ గ్రామాలను ముంచేత్తనుందా..? ఐదు మండలాలు పూర్తిగా నీళ్లలో ఉండిపోనున్నాయా..? అవుననే అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు.. ఎగువు నుంచి వస్తున్న వరదల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 20లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.  ఫలితంగా భద్రాచలం పరివాక ప్రాంతానికి వచ్చే సరికి గోదావరి ఉగ్రరూపం దాల్చనుంది. గంటగంటకు వరద ఉద్రుత్తి పెరిగి రాత్రి సమయానికి భద్రాచలంను చుట్టుముట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి చరిత్రలో 1986లో వచ్చినట్లుగాఈ సారి 70 అడుగుల మేర నీళ్లు ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, కుక్కునూరు, చర్ల ఇతర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే కలిసిన పలు మండలాలు కూడా ముంపునకు గురి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 200 గ్రామాలు పూర్తిగా నీళ్లలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది..

ఇది కూడ చదవండి: జిల్లాలోనే మకాం వేసిన  మంత్రి పువ్వాడ 

64 అడుగుల నీటిమట్టం ప్రవహిస్తే కచ్చితంగా వందలాధి ఇండ్లు గోదావరిలో కొట్టుకపోవడం ఖాయం. చాలా నష్టం వచ్చే ప్రమాదం దాగి ఉన్నట్లు కన్పిస్తోంది.. అయితే ఇంత వరద చరిత్రలో ఎప్పుడు రాలేదని, 1969లో 58 అడుగులు, 1994 లో 58 అడుగల మేర వరద ప్రవాహం వచ్చినట్లు, అలాగే 1986లో 70అడుగులు రావడంతో ఆ సమయంలో ఊళ్లకు ఊళ్లే గోదావరిలో కొట్టుకపోయిన పరిస్థితులున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా అదే ప్రమాద స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే అలాంటి ప్రమాదం ముందే పసిగట్టిన అధికారులు ఒక రోజు ముందుగానే అప్రమత్తమైయ్యారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 33 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు మరో 70 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఐదు మండలాల్లో ఉన్న ప్రజలందర్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కొంత మంది రాకపోయినప్పటికి బలవంతంగా పునరవాస కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు. అలాగే ఎలాంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్డీఆర్ఎఫ్ బ్రుందాలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం కూడా గోదావరి విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రులు కూడా ఆయా జిల్లాలో మకాం వేసి ఎప్పటికప్పుడు గోదావరి ప్రవహాన్ని పరిశీలిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అధికారులకు సూచనలు , సలహాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వరద పరిస్థితులను చూసి భద్రాచలం లేదంటే కొత్తగూడెం వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోం ది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్ని మండలాల, అన్ని శాఖలాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసి, వారందరికి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి : మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ పోన్