Telugu News

టీఆర్ ఎస్ పార్టీ నుంచి వ‌న‌మా రాఘ‌వ స‌స్పెన్ష‌న్‌…

పాల్వంచ ఘటనపై సీఎం సీరియస్

0

టీఆర్ ఎస్ పార్టీ నుంచి వ‌న‌మా రాఘ‌వ స‌స్పెన్ష‌న్‌…

** పాల్వంచ ఘటనపై సీఎం సీరియస్

** రాఘవేంద్రరావు ను సస్పెండ్ చేస్తూ పార్టీ ఆదేశాలు

(హైదరాబాద్-విజయం న్యూస్)

టీఆర్ఎస్ పార్టీ వనమా రాఘవేంద్రరావు ను సస్పెండ్ చేసింది. పాల్వంచ లోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమాచారం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆగ్రహించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు కేసీఆర్ సూచ‌న‌మేర‌కు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పార్టీ ఖ‌మ్మం వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి నూక‌ల న‌రేష్ రెడ్డిలు  కొత్త‌గూడెం పార్టీ నాయ‌కులు వ‌న‌మా రాఘ‌వేంద్ర‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుందని తెలిపారు. అయితే ఈ కేసు గురించి మాత్రం ఎవరు స్పందించలేదు.

Al so read:- వనమా రాఘవ నా భార్యను కోరాడు.. ఎలా పంపగలను?: రామకృష్ణ సెల్ఫీ వీడియో వైరల్