Telugu News

భద్రాద్రి రామయ్య సత్రంలో అపచారం          

** భక్తులకు వర్ధంతి భోజనాలు వడ్డింపు

0
అయ్యో రామ రామ…!             
** దేవస్థానం అన్నదాన సత్రంలో అపచారం
** భక్తులకు వర్ధంతి భోజనాలు వడ్డింపు 
**  సత్రం బయట ఫ్లెక్సీ పెట్టి మరీ                                 
** బయటకు పొక్కిన వ్యవహారం                               
** విచారం వ్యక్తం చేస్తున్న రామభక్తులు                   
(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి -విజయం న్యూస్) :
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన సత్రంలో మంగళవారం అపచారం చోటుచేసుకుంది. భక్తులు ప్రసాదంగా భావించి తీసుకున్న ఆహారం వర్ధంతిని పురస్కరించుకొని పెట్టారన్న వాస్తవం తెలుసుకున్న  భక్తులు నిర్ఘాంతపోయారు…!  రాముడి ప్రసాదంను వర్ధంతి భోజనంగా మార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది…! వర్ధంతి కార్యక్రమం అంటూ ఫ్లెక్సీ పెట్టి మరీ.. జరిగిన అపచారం పై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి రాముని నిత్య అన్నదాన సత్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన పై విజయం న్యూస్ అందిస్తున్న  ప్రత్యేక కథనం….                                                     రాముని సన్నిధిలో అపచారం : భద్రాచలం పుణ్య క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా కూడా భావిస్తారు. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు భద్రాద్రి రాముని దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి తరలి వస్తారు. రాముని దర్శనం అనంతరం పరమ పవిత్రంగా భావించే అన్న ప్రసాదాన్ని భక్తులు తీసుకుంటారు. ఇందుకోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య అన్నదాన సత్రం కొనసాగుతోంది. భక్తులు ఇచ్చే కానుకలతో ఈ అన్నదాన సత్రం నిర్వహణ సాగుతోంది. ప్రతిరోజూ 400 నుంచి 500 మందికిపైగా భక్తులకు అన్న ప్రసాదం చేస్తారు. అయితే మంగళవారం అన్నదాన సత్రంలో ఒక అపచారం చోటుచేసుకుంది. అన్నదాన సత్రం ఎదుట ఓ వ్యక్తి వర్ధంతికి సంబంధించిన ఫ్లెక్సీ పెట్టారు. లోపట భక్తులకు అన్నదానం కొనసాగింది. అయితే బయట వర్ధంతి ఫ్లెక్సీ పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. విషయం తెలుసుకున్న దేవస్థానం సిబ్బంది ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించినట్లు సమాచారం. బయట వర్ధంతి ప్లెక్సీ, లోపట అన్నదానం కొనసాగటం భక్తులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. జరిగిన ఘటన బయటికి పొక్కడంతో అయ్యో రామా…అపచారం అపచారం అంటూ భక్తులు తీవ్ర విస్మయానికి లోనయ్యారు.  భక్తుల కోసం రాముడి ప్రసాదంగా  రాముల వారికి నివేదించిన భోజనమును ప్రసాదంగా అన్నదానం వచ్చే భక్తులకు దేవస్థానం అందజేస్తుంది. అటువంటి ఈ గొప్ప అన్నదానం నిర్వహణలో ఇటువంటి అపచారం చోటు చేసుకోవడం పట్ల దేవస్థానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాన సత్రం ఎదుట ఫ్లెక్సీ కి ఎవరు అనుమతి ఇచ్చారన్న విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
 అన్నదానం విరాళం చెల్లింపు :
                 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో మంగళవారం ఒకరు దివంగతులైన తమ కుటుంబ సభ్యుని  పేరు మీదుగా అన్నదానం చేసేందుకు   రూ. 15 వేలు విరాళం అందజేసినట్లు తెలిసింది. అక్కడ వరకు బాగానే ఉన్నా నిత్య అన్నదాన సత్రం ఎదుట వర్ధంతి ఫ్లెక్సీ పెట్టడం వివాదానికి తెర తీసింది. గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు నిత్యాన్నదాన సత్రం వద్ద చోటు చేసుకోలేదని భక్తులు పేర్కొంటున్నారు. తమ తమ వారి పేరులో మీదుగా భక్తులు విరాళాలు ఇవ్వటం పరిపాటే కానీ… వర్ధంతి ఫ్లెక్సీలు పెట్టటం మాత్రం సరైంది కాదంటూ భక్తులు తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. భద్రాచలం రామాలయం నిత్య అన్నదాన సత్రం ఎదుట వర్ధంతి ఫ్లెక్సీ పెట్టి లోపల భోజనాలు పెట్టిన సంఘటనపై రామాలయం ఈవో శివాజీని విజయం న్యూస్ వివరణ కోరగా, సదరు భక్తులు విరాళం ఇచ్చిన మాట వాస్తవమేనని జరిగిన ఘటనపై  విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవోచ్చు : ‌ యువతిపై సామూహిక అత్యాచారం