Telugu News

కటకటలకు కామాందుడు.. వనమా రాఘవ అరెస్ట్ 

దమ్మపేట సమీపంలో అరెస్టు చేసిన పోలీసులు

0
కటకటలకు కామాందుడు
**వ‌న‌మా రాఘ‌వ అరెస్ట్‌…*
** దమ్మపేట సమీపంలో అరెస్టు చేసిన పోలీసులు
** దృవీకరించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునిల్ దత్
(భద్రాద్రికొత్తగూడెం-విజయం న్యూస్)
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  జ‌న‌వ‌రి 3 వ తేదీన పాల్వంచ‌లో రామ‌కృష్ట అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.  ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని త‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం వ‌న‌మా రాఘ‌వ అని, ఆయ‌న చేసిన అక్ర‌మాల గురించి సెల్పీ వీడియోలో పేర్కొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.  ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. దీంతో వ‌న‌మా రాఘ‌వ‌ను అరెస్ట్ చేయాల‌ని రాజ‌కీయ పార్టీలు వ‌న‌మా ఇంటిని చుట్టుముట్టిన సంగ‌తి తెలిసిందే.  ప‌లువురు నేత‌లు ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.  వ‌న‌మా రాఘ‌వ‌ను అరెస్ట్ చేయాల‌ని, ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కొత్తగూడెం నియోజకవర్గం బందుకు పిలుపునివ్వడం ఉద్రిక్తత పరిస్థితుల నడుమ  రాస్తారోకోలు నిరసనలు, అరెస్టుల నడుమ బంద్ సంపూర్ణంగా ముగిసింది.  వనమాను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. రాష్ట్రస్తాయి నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించారు. దీంతో పరిస్థితి చేయిదాటే పరిస్థితి కనిపిస్తోంది. Also read:-  టీఆర్ ఎస్ పార్టీ నుంచి వ‌న‌మా రాఘ‌వ స‌స్పెన్ష‌న్‌…
 ** రాఘవ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతంలో వనమా రాఘవేంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివారు దమ్మపేట సమీపంలో వనమా రాఘవ ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అధికారికంగా ధృవీకరించారు రాఘవ ను కొత్తగూడెం కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. వనమా రాఘవ పై 302 306 307 సెక్షన్ కింద ఈ నెల 6న కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు పాల్వంచ రామకృష్ణ ఆయన కుటుంబం ఆత్మహత్య సంఘటనలు రాఘవేంద్ర ఎటు నిందితుడిగా పైన తెలిపిన సెక్షన్లకు ప్రకారం కేసు నమోదు చేసి రాఘవ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించామని తెలిపారు కానీ ఈ నెల 3 నుంచి వనమా రాఘవ పరారీలో ఉన్నాడని ఆయన కోసం ఎనిమిది బృందాలుగా విడిపోయి ఆయన ఆచూకి కోసం గాలించినట్లు తెలిపారు. కాగా శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని మీడియాకు సమాచారం అందించారూ.

Allso read:- వనమా రాఘవకు మరో షాక్..