చర్ల ఆసుపత్రికి చరిత్ర ఎంతో ఘనం – భవిష్యత్తు అంధకారం.
–శతాబ్ద చరిత్ర కలిగిన దవాఖానకు చెదలు
–కూలేందుకు సిద్దంగా ఉన్న స్లాబ్
–కనికరం లేని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
–ప్రమాదపు అంచున పేదల వైద్యం
(చర్ల-విజయం న్యూస్)
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చర్ల ప్రభుత్వ ప్రాదమిక ఆరోగ్య కేంద్ర ప్రతిష్ట నేడు మసక బారి పోయింది. శతాబ్ద కాలం గా చర్ల మండల పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచి న పేదల దవాఖానా ఆదరించే వారు లేక తనే జబ్బు సోకి బాదపడుతోంది.పట్టణ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించి నడిపించిన సేవా సంస్థ తనే కుంటిదిగా మారి సహాయానికై ఎదురు చూపులు చూస్తోంది. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి పేదల వైధ్యశాల పేషెంట్ అయ్యింది.
–కొయ్యూరు కు బదిలీ తరువాత అంతా అస్తవ్యస్తం
చర్ల సీమాంగ్ సెంటర్ కొయ్యూరు లో పిహెచ్సి నూతన భవనం నిర్మాణ అనంతరం వైద్య- ఆరోగ్య అధికారుల నిర్లక్ష్యానికి గురైన మాట అక్షర సత్యం. ఒకానొక సమయంలో పూర్తి సేవలను చర్ల పట్టణం లో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తరలించి కొయ్యూరు కు పరిమితం చేయాలని భావించారు. కొంత కాలం వైద్య సేవలు నిలపివేశారు కూడా కానీ స్థానిక రాజకీయ పార్టీలు, ప్రజలు,పత్రిక లు బలం గా స్పందించడం తో నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఇది కూడా చూడండి :- మణుగూరులో అనధికార చిట్టీల వ్యాపారం..
–సీమాంగ్ సెంటర్ హోదా కల్పిస్తామంటూ ఎమ్ పి హామీ ఏమైంది?
పెల్లుబికిన ప్రజా ఆందోళన లతో చర్ల పర్యటన కు వచ్చిన మహబూబ్ బాద్ పార్లమెంటు సభ్యులు మాలోతు కవిత చర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తరలి పోదని,సమస్త హంగులతో సీమాంగ్ సెంటర్ గా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తయింది. కానీ ఎటువంటి మార్పులు రాలేదు. అదే రీతిన సాదారణ వైద్య శాల స్థాయి కి తగ్గించి వైద్య సేవలు అందుతున్నాయి.
–విరిగిన మంచాలు, కూలడానికి సిద్దంగా ఉన్న స్లాబు
రోగులకు మంచాలు కూడా లేని పరిస్థితి దవాఖానలో నేడు నెలకొంది. ఎప్పుడు కూలుతుందో అని అనుమానం వచ్చేలా శ్లాబు కనపడుతోంది.పెచ్చులు ఊడి రోగులపై పడేందుకు సిద్దంగా శ్లాబు ఉంది. అంతేకాకుండా స్లాబు క్రుంగి వర్షపు నీరు నేరుగా పేషెంట్లు ఉండే జనరల్ వార్డ్ లో మంచాలపై పడుతోంది. ఈ పరిస్థితి చూసి అక్కడే ఉండలేక, పేదరికం కారణంగా బయట ప్రైవేటు వైద్యం కొరకు వెల్లలేక రోగులు అష్ట కష్టాలు పడుతున్నారు.
విశ్లేషణాత్మక పోలిటికల్ స్టోరి ఒపెన్ చేసి చదండి :- పల్లెబాటన కాంతన్న.. పరామర్శల యాత్రలో పాయం.