Telugu News

సర్వం సిద్దమైన సర్కార్ మెడికల్ కళాశాల

ఈ ఏడాది నుండే తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు

0

సర్వం సిద్దమైన సర్కార్ మెడికల్ కళాశాల

== నిర్మాణ పనులు పూర్తి

== ఈ ఏడాది నుండే తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు

== అతి త్వరలో 150 సీట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాలలో తరగతులు..

== ఫలించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువత సుధీర్ఘ కల..

== జిల్లా ప్రజల తరుపున సీఎం కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ

== అతి త్వరలో మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు చేతుల మీదగా ప్రారంభం

(PENDRA ANJAIAH)

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 26(విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లా ప్రజలకు, మెడిసిన చదవాలనుకునే నిరుపేద యువతియువకులకు శుభవార్త.. ఎన్నో రోజుల కల నెరవేరే సమయం అసన్నమైంది.. కాదు.. అంతా సిద్దమైంది.. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తైయ్యాయి.. ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు షర వేగంగా జరుగుతున్నాయి.. అతికొద్ది రోజుల్లోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా మెడికల్ కళాశాలలో 150 సీట్లు భర్తి చేసి తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ALLSO READ- విభజన హామిలు ఏమయ్యాయి ?: నామా నాగేశ్వరరావు

అతి త్వరలోనే రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, వైద్యశాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు  చేతుల మీదగా ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెడిసిన్ చదువుకోవాలని ఆసక్తి కనబర్చే యువతియవకులు అత్యధికంగా ఉన్నారు. మెడిసిన్ చదువుల కోసం లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ కళాశాలలో ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మెడిసిన్ కళాశాల మంజూరు కోసం ప్రజలు, యువకుల నుంచి డిమాండ్ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ఆ నినాదం యువతలో పెరిగిపోయింది. అయితే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు మెడికల్ కళాశాల కోసం ప్రభుత్వం ముందు చర్చించారు. అనుమతుల కోసం అన్ని సిద్దమైయ్యే సమయంలో ఎన్నికలు రావడం, ఆ మెడికల్ కళాశాల మంజూరు సంగతి కథ కంచికి చేరింది. దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందు కూడా యువతియువకులు మెడికల్ కళాశాల మంజూరు పై చర్చకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొంత ఆరోపణలు కూడా వచ్చాయి. మమత కళాశాల ఉండటం వల్ల నూతన కళాశాల మంజూరుకు అడ్డు పడుతున్నారని పలు పార్టీల నాయకులు మంత్రి పువ్వాడపై విమ్మర్శులు చేశారు. దీంతో చాలేంజ్ గా తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎం కేసీఆర్ తో చర్చించి మెడికల్ కళాశాల మంజూరు చేయించడంలో సఫలమైయ్యారు. ఆగమేఘాల మీద జీవో జారీచేశారు. కాగా అంతే స్పీడుగా కళాశాల ఏర్పాటు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. జీవో వచ్చి రెండు నెలల సమయం కూడా పూర్తి కాకుండా మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో ఈ పనులన్ని జరుగుతుండటం విశేషం.

ALLSO READ- బండి సంజయ్ కి పిచ్చిలేసింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొదటి విడతలో మెడికల్ కళాశాల మంజూరు అయిన నేపథ్యంలో ఆయా కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఅర్ అభీష్టం మేరకు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కొత్తగూడెం మెడికల్ కాలేజీలో 150 సీట్లతో వైద్య విద్యను సామాన్యులకు మరింత చేరువ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు రెండు మెడికల్ కళాశాలలు మంజూరు కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళాశాల భవనం, ఇతర సముదాయాలు పూర్తి చేసుకున్నారు. నిబంధనల మేరకు కాలేజీకి అవసరమైన మౌలిక సౌకర్యాలు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్‌, సౌకర్యాలు, ఫ్యాకల్టీ, అనుభవం, పబ్లికేషన్స్‌, హాస్టల్ భవనం, నర్సింగ్‌ అండ్‌ పారా మెడికల్‌ సిబ్బంది వంటి సౌకర్యాలను ది మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు (ఎంఏఆర్‌బీ) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కళాశాలలకు, విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులలో కృషి చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మెడికల్‌ కళాశాల ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్‌ గారు చేసి నిరూపించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పేర్కొన్నారు.గిరిజనులు అత్యధికంగా ఉన్న కొత్తగూడెం జిల్లాకు సైతం మెడికల్ కళాశాల మంజూరు చేసి సామాన్యులకు కూడా వైద్య విద్యను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.