Telugu News

ఎమ్మెల్యే రేగా సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు.

పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే రేగా 

0
ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
== పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే రేగా 
అశ్వాపురం, అక్టోబర్ 18, (విజయం న్యూస్)
 మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందన నియమని అన్నారు, కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, కార్యకర్తలు నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు, దేశంలోనే ఎక్కడలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే అమలవుతున్నాయని అన్నారు, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సీనియర్ నాయకులు సుదిరెడ్డి గోపి రెడ్డి, చిలక వెంకటరమయ్య ,పిట్టా శ్రీను, కడారి శేఖర్, సతీష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.