Telugu News

విద్యార్థులకు కరోనా.. హై స్కూల్లో టెన్షన్

సెయింట్ మేరీ పాఠశాలలో కోవిడ్ పరీక్షలు

0

విద్యార్థులకు కరోనా.. హై స్కూల్లో టెన్షన్
– సెయింట్ మేరీ పాఠశాలలో కోవిడ్ పరీక్షలు
(భద్రాద్రి కొత్తగూడెం-విజయం న్యూస్):

కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ప్రైవేట్ సెంట్ మేరీస్ స్కూల్ లో గురువారం కరోనా కలకలం రేపింది. ఐదుగురు విద్యార్థులకు కరోనా వచ్చినట్లు ప్రచారం జరుగుతుండగా కొందరు టీచర్లు మాత్రం ఒకరికే కరోనా వచ్చినట్లు చెప్పడం గమనార్హం. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు తెలియడంతో వెంటనే వారు రంగంలోకి దిగి కరోనా పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

శుక్రవారం కూడా మరికొందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. స్కూల్లో విద్యార్థులకు కరోనా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులలో టెన్షన్ నెలకొంది. స్కూల్ యాజమాన్యం కూడా ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఒక పూట స్కూల్ మాత్రమే నడిపించేందుకు చర్యలు చేపట్టింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయకుండా యాజమాన్యం చూడాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఫీజులు ఫీజులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల పై ఒత్తిడి చేయవద్దని విద్యార్థి సంఘాల నాయకులు యాజమాన్యానికి సూచించారు.

Also read:- మంచంపై కూతురి శవం.. కనిపించని అల్లుడు, అసలేమైంది?