Telugu News

బహుజనులంటే పార్టీలకు చిన్న చూపేందుకు

కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ అభ్యర్థి మద్దిశేటి అజయ్ బాబు (ఎర్రప్ప)

0
బహుజనులంటే పార్టీలకు చిన్న చూపేందుకు: ఎర్రప్ప
== ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు  క్రైస్తవులు ఓట్లకే తప్ప ఎన్నికల బరిలో నిలబడటానికి పనికిరారా….* 
== కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ అభ్యర్థి మద్దిశేటి అజయ్ బాబు (ఎర్రప్ప)
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ అభ్యర్థి మద్దిశేటి అజయ్ బాబు (ఎర్రప్ప) మాట్లాడారు. 70 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ లోకసభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడం చాలా సంతోషకరంగా ఉందని గెలుపు ఓటమి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇన్ని సంవత్సరాలు కూడా అగ్రకులాలే పరిపాలించాయి. ఒకసారి బహుజనులకు అవకాశం ఇచ్చి చూడండి. బలం, ధనం, కులం కలిగిన వ్యక్తులే ఆ మూడు పార్టీలకు అవసరం. లోకసభ ఎన్నికలలో బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అగ్రకులాలకే అభ్యర్థులు అవకాశం ఇచ్చారు కానీ అన్నగారిన కులాలకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు. దళిత బహుజనులు అంతే మీకు అంత చులకన ? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్ల వెయ్యడానికే తప్ప రాజకీయంలో పోటీ చేయడానికి పనికిరారా… ఇదెక్కడి న్యాయం ? ఓట్లు కూడా ఆ మూడు పార్టీలు ఆ సామాజిక వర్గాన్ని అడిగి వేసుకుంటే బాగుంటుంది కదా !దళిత ఓట్లు ఎందుకు. ఓట్లు మాయి సీట్లు మియా ? ఇప్పటికైనా దళిత బహుజన సోదరులారా మేల్కోండి. పార్టీలలో చాలాకాలం కష్టపడి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వారిని వదిలేసి చుట్టం చూపుగా వచ్చే పోయే వారిని లోకసభ పోటీలలో ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడం ఎంతవరకు కరెక్టు అనేది కాంగ్రెస్ పార్టీ , బిజెపి పార్టీ ఆలోచించాలి . బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ చేసిన అభివృద్ధి ఏంటి ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు . బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే  రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నటం ఎంతవరకు కరెక్ట్ , క్రిస్టియన్లకు , ముస్లింసులకు ఓటు రద్దు చేస్తామంటరు అలాగే రిజర్వేషన్ తీసేస్తామంటారు ప్రధాని నరేంద్ర మోడీ దీనికి ఖమ్మం లోకసభ బిజెపి ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ వివరణ ఇవ్వాలి . కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు నందిని , రాయల్ నాగేశ్వరరావు , పొదిలా వీరయ్య లాంటి వారిని , సీనియర్ నాయకులను కాదని మరియు పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తులను కూడా కాదని కొత్తవరైన రామ సహాయం రఘురాంరెడ్డిని లోకసభ ఎంపీ అభ్యర్థిగా ఎన్నుకోవడం వెనక ఉద్దేశమేంటి . కులం పేరుతో , ప్రాంతీయ పేరుతో , మతం పేరుతో చేసే పార్టీలు పార్టీలే కాదు . ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించి పార్టీని చూసి కాదు వ్యక్తిని చూసి ఓట్టు వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ అభ్యర్థి మద్దిశేటి అజయ్ బాబు (ఎర్రప్ప) అన్నారు . ఈ కార్యక్రమంలో సి.ఎం.డి.ఎఫ్ నేత వేములపల్లి తిమోతి , బి.యం.పి జిల్లా అధ్యక్షుడు మట్టి తిమోతి , టి.వై జేఏసీ నేత స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు .