Telugu News

వనమా రాఘవకు బెయిల్

విజయం న్యూస్

0

వనమా రాఘవకు బెయి

(విజయం న్యూస్);-
రాఘవ బెయిల్ పిటిషన్ని పలుమార్లు తిరస్కరించిన హైకోర్టు, గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో 61 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రాఘవకు విముక్తి లభించనుంది.వివరాలలొకి వెల్లితే
పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవకు ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న రాఘవకు గురువారం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

also read;-తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్ లో 2,56,958 కోట్ల రూపాయలతో అభివృద్ధి

వనమా రాఘవ కొత్తగూడెం నియోజకవర్గంలో పోలీస్స్టేషన్లో ప్రతి శనివారం సంతకం పెట్టాలని సూచించింది. షరతులు పాటించకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించిందిపాత పాల్వంచకి చెందిన మీ సేవ నిర్వాహకుడు నాగరామకృష్ణ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి జనవరి నెలలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం విధితమే. ఈ ఘటన అనంతరం నాగరామకృష్ణ రాసిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు బయటపడటం తో వనమా రాఘవే కారణమని బాధితుడు చెప్పడం భార్యను తన గదికి పంపాలని వేధించాడని తెల్పటంతో తీవ్ర దుమారం రేగింది.

also read;-టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు
తదనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నాగరామకృష్ణ సెల్ఫీ వీడియోల ఆధారంగా పోలీసులు వనమా రాఘవను అరెస్ట్ చేసి ఈ కేసులో ఏ2గా చేర్చారు. అనంతరం బాధితుడి తల్లి, అక్కను సైతం అరెస్ట్ చేయగా.. వారికి హైకోర్టు కొద్దిరోజుల క్రితమే బెయిల్ మంజూరు చేసింది.