Telugu News

తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

మొత్తం 38 కేసులో 32 కేసుల కి సంబంధించి బెయిల్ మంజూరు

0

తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

◆ మొత్తం 38 కేసులో 32 కేసుల కి సంబంధించి బెయిల్ మంజూరు

◆ మిగిలిన 6 కేసులని కొట్టివేసిన న్యాయస్థానం

(హైదరాబాద్‌ – విజయం న్యూస్)

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌ చిలకలగూడ సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు రెండు నెలలకుపైనే ఆయన జైల్లో ఉన్నారు. ఆయనపై మొత్తం 38కేసులుండగా అందులో ఆరు కేసులను కోర్టు కోట్టేసింది . మిగిలిన 32కేసులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఈరోజు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన ఈ రోజు కానీ రేపు కానీ విడుదలైయ్యే అవకాశం ఉంది.