ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితులకు బెయిల్
== సంచలన నిర్ణయం ప్రకటించిన కోర్టు
(హైదరాబాద్-విజయంన్యూస్)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిర్ మంజూరైంది. రామంచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీ ఇవ్వాలని నిందితులకు కోర్టు సూచించింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హార్ట్ టాఫిక్ గా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.. కేంద్రప్రభుత్వం కావాలనే కుట్రపన్నుతు మా పార్టీ నాయకులను కొనుగోలు చేస్తున్నారని, మా పార్టీ నాయకులు నిజాయతీని బయటపెట్టేందేకు కొనుగోలు చేసేందుకు వచ్చిన దొంగలను పోలీసులకు ఎమ్మెల్యే పట్టించారని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన పరిస్థితి అందరం చూశాం. అలాగే ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామా.. పోలీసులకు పట్టించేవారు ఫామ్ హౌజ్ లో ఎలా ఉంటారని బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ పై మండిపడిన పరిస్థితి చూశాం.. మొత్తానికి ఎమ్మెల్యేల ఎర కేసు రోజుకో మలుపు తిరిగి చివరికి బెయిల్ మంజూరు వద్దకు చేరింది.
ఇది కూడా చదవండి: వెంకటాపురం రెవెన్యూ శాఖలో..రింగ్ మాస్టర్