Telugu News

త్యాగానికి ప్రతీక బక్రీద్: నామా 

ముస్లింలకు ఎంపీ నామ నాగేశ్వరరావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

0

త్యాగానికి ప్రతీక బక్రీద్: నామా 
👉 అల్లా అందర్నీ చల్లగా చూడాలి.
👉 మతం ఏదైనా మానవత్వం గొప్పది.
👉 ముస్లింలకు ఎంపీ నామ నాగేశ్వరరావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు
 ఖమ్మం,జూన్ 28(విజయంన్యూస్)

 త్యాగానికి ప్రతీకైన పవిత్రమైన బక్రీద్ పండుగను ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధలు, సంతోషాలతో జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మానం తర్వాత వచ్చే అతి ముఖ్యమైన ఈ త్యాగాల పండుగ ముస్లింల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని నామ ఆకాంక్షించారు. అల్లా అందర్నీ చల్లగా చూడాలని, అందరూ అభివృద్ధిలోకి రావాలని నామ కోరుకున్నారు.
మతం ఏదైనా మానవత్వం ఎంతో గొప్పదని చాటి చెప్పేదే బక్రీద్ పండుగ అని నామ పేర్కొన్నారు. దేవుడి చల్లని చూపులు అందరిపైనా ఉండాలని అన్నారు. త్యాగనిరతితో పాటు మనోవాంఛ, స్వార్ధం, అనూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్ధం అన్నారు. బక్రీద్ అంటేనే త్యాగానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. బక్రీద్ పండుగ దాన గుణాన్ని వెల్లడిస్తుందన్నారు. దానం ఎంతో ఉత్తమమైనదని చెబుతుందన్నారు. నిరుపేదలకు ఎంతో కొంత దానం చేసి, వారిని సంతృప్తిపర్చాలన్నదే పండుగ స్పష్టం చేస్తుందన్నారు. జీవితం చిన్నదని, దాన్ని ప్రేమ, త్యాగాలతో నింపుకోవా లన్నారు. తమ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. మంచికోసం, మానవ సంక్షేమం కోసం ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చేయ్యాలన్న సందేశం బక్రీద్ పండుగ ఇస్తుందన్నారు. పరోపకారమే పండుగ సందేశమన్నారు. సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచు కోవాలని పండుగ సూచిస్తుందన్నారు. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొందించాలని ప్రార్ధిద్దామని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
——————–
 పీవీకి ఎంపీ నామ ఘన నివాళి
➡️ పీవీ ఘనత తెలంగాణకే గర్వకారణం
👉 బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు
భావి తరాలకు స్పూర్తి ప్రదాత మన పీవీ నరసింహా రావు అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  ఘనంగా నివాలర్పించి, పుష్పాంజలి ఘటించారు..బుధవారం పీవీ జయంతిని పురస్కరించుకొని పత్రికా ప్రకటన విడుదల చేశారు.పీవీ ఘనత దేశ చరిత్రలోనే అద్వితీయ యమని, పీవీ తెలంగాణాకే గర్వ కారణమని తెలిపారు.  సంస్కరణలకు ఆద్యుడు పీవీ అన్నారు. ఆయన చైతన్య మూర్తి అని కొనియాడారు. అపార జ్ఞానిగా , మానవతా మూర్తిగా నవ భారత నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.
సమైక్య రాష్ట్ర సీఎం గా పెద్ద ఎత్తున భూసంస్కరణలు అమలు చేసి పేదల పక్షాన పోరాడిన నాయకుడని పేర్కొన్నారు. భావి భారతానికి వినూత్న రీతిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయించిన బహు బాషా కోవిధులని అన్నారు. దేశ చరిత్రలోనే గొప్ప మేధావి,  పరిపాలనాదక్షుడు  అన్నారు.క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టిన గొప్ప పరిపాల కుడు ,రాజకీయ దురందరుడు పీవీ అని అన్నారు. అంతర్జా తీయ సమాజంలో భారత్ పేరు ప్రఖ్యాతులను ఇనుమడింప జేసిన సమర్ధ పాలకుడని నామ నాగేశ్వరరావు అన్నారు. తనకున్న మేధా సంపత్తితో భారత్ ను అగ్ర దేశాల సరసన నిలిపిన గొప్ప దార్శనికుడు పీవీ అని  పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి గా, కేంద్ర మంత్రి గా, ప్రధానిగా తన అపూర్వ మేధాశక్తి, రాజనీతితో దేశాన్ని ముందుకు నడి పించారని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు.