Telugu News

భక్త రాందాస్ ప్రాజెక్టు నీటి విడుదల

0

భక్త రాందాస్ ప్రాజెక్టు నీటి విడుదల
◆◆ సంతోషం వ్యక్తం చేస్తున్న అధికారులు.
◆◆ పరిశీలించిన తిరుమలాయపాలెం ఎంపీపీ బోడా మంగిలాల్

(కూసుమంచి -విజయం న్యూస్)
ఒక వైపు వర్షాలు కురవడం లేదు.. మరో వైపు వరినాట్ల సీజన్ పూర్తవుతుంది…చెరువులో నీళ్ళు ఉన్నప్పటికీ ఫలితం లేదు.. వరినాట్లేసిన పోలాలు ఎండుతున్నాయి.. పత్తి, చెరకు, పెసర పంటలు ఎండుముఖమేశాయి.. ఎం చేయాలో అర్థం గాక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.. వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ అంటూ ప్రార్థిస్తున్నారు.. వరుణదేవుడ్ని వేడుకుంటున్నారు దీంతో రైతులు ఒకింత బాధలో మునిగారు. ఇంతలో భక్తరామదాసుడు కరుణించాడు.. ప్రాజెక్టు అధికారులు తీపి కబురు అందించారు. భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి నీటీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు బుధవారం కూసుమంచి మండలం లో ఎర్రగడ్డ తండా వద్ద ఉన్న భక్త రామదాసు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నుండి అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో రైతుల్లో ఉత్సాహం వచ్చింది.. దీని ద్వారా పాలేరు నియోజకవర్గంలో అనేక గ్రామాల రైతులకు ప్రజలకు నీటి కష్టాలు తొలగనున్నాయి. ప్రస్తుత తరుణంలో వరి నాట్లకు, మిర్చి తోటలకు ఈ నీరు రైతులకు ప్రయోజనం చేయనున్నాయి.

Water Force Inspcted By MPP
Water Force Inspcted By MPP

◆◆ నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎంపీపీ

భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావత్ తండా వద్ద ఉన్న సంప్ హైస్ ను తిరుమలాయపాలెం ఎంపీపీ బోడా మంగిలాల్, ఇరిగేషన్ అధికారులు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నీటి విడుదల ఎన్ని రోజులు కొనసాగుతుందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇది చాలా శుభపరిణామం అని అన్నారు. వర్షాలు కురవకా చాలా రోజులైందని, దీంతో సాగు చేసిన పత్తి, మిర్చి, వరి పంటలు ఎండిపోతున్నాయని, ఈ క్రమంలో భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా నీటీని విడుదల చేయడం సంతోషం అన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృధా చేయోద్దని ఎంపీపీ రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇరిగేషన్ ఈఈ జీ.. సమ్మి రెడ్డి , డీఈఈ బి.రమేష్ రెడ్డి, ఏఈఈ ఎండీ అయేషా సుల్తానా, D.సురేష్ తదితరులు పాల్గొన్నారు.