Telugu News

దిశ జిల్లా కమిటీ సభ్యుడిగా బాలాజీ.

ఏన్కూరు విజయం న్యూస్

0

దిశ జిల్లా కమిటీ సభ్యుడిగా బాలాజీ.

(ఏన్కూరు విజయం న్యూస్): –

దిశ జిల్లా కమిటీ సభ్యుడిగా ఏన్కూర్ మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు బాదావత్ బాలాజీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిశ కమిటీ చైర్మన్ గా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు నేతృత్వంలో నూతన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో బాలాజీని నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. దిశ జిల్లా కమిటీ సభ్యుడిగా తనను నియమించడం పట్ల బాలాజీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం తన వంతు కృషి చేస్తానని బాదావత్ బాలాజీ తెలిపారు. ప్రస్తుతం బాలాజీ భార్య బుజ్జి ఏనుకూరు జెడ్పిటిసి సభ్యురాలు గా పని చేస్తున్నారు.