Telugu News

బాలాపూర్ లడ్డు 24.60లక్షలు

** చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డు

0

బాలాపూర్ లడ్డు 24.60లక్షలు

** చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డు

** వేలంలో కైవసం చేసుకున్న లక్ష్మారెడ్డి

(హైదరాబాద్-విజయం న్యూస్) 
బాలాపూర్ లడ్డూ వేలం మరోసారి రికార్డు సృష్టించింది. లక్ష్మారెడ్డి అనే భక్తుడు ఏకంగా 24.60లక్షలకు బాలాపూర్ లడ్డును కైవసం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా లడ్డూ వేలం ఇంత భారీగా వేలమైన చరిత్ర లేదు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట తన రికార్డును తిరగరాసింది. రూ. 24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది వేలంలో మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.90 లక్షలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోగా…

Allso read:- వినాయక నిమజ్జనం ఎప్పుడు..?

ఈ సారి అంతకు మించి రూ.24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి కైవసం చేసుకున్నారు.గతేడాది కంటే రూ.5లక్షల 70 వేలు ఎక్కువ పలికిన బాలాపూర్ లడ్డూ ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది… ఈ సారి రికార్డ్ స్థాయిలో వేలంను దక్కించుకున్నారు. అయితే ఈ ఏడాది వేలం పాటలో బాలాపూర్ గ్రామస్థుడు వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
** హాజరైన మంత్రులు సబితా, తలసాని

29 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్‌ గణేష్‌ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్‌ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు.

Allso read:- ఆశయమా… ఆత్మరక్షణా..
** వేలంలో హాజరైన 28మంది పాటదారులు
బాలాపూర్ లడ్డూ వేలంలో ఈ ఏడాది నిర్వహించిన వేలం పాటలో 28 మంది పాల్గొన్నారు.
బాలాపూర్‌ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోలతో తయారు చేయనున్నారు. 1980లో బాలాపూర్ విఘ్నేశ్వరుడికి పూజలు ప్రారంభమవగా వేలం మాత్రం 1994లో మొదలైంది. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఈ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే గణనాధుడి ప్రసాదం కోసం భక్తులతో పాటు ప్రముఖులు సైతం పోటీపడతారు.