Telugu News

బీఆర్ఎస్ కు బాలసాని రాజీనామా..

తుమ్మల, పొంగులేటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక

0

బీఆర్ఎస్ కు బాలసాని రాజీనామా..

== తుమ్మల, పొంగులేటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా లో‌ బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికలు గడువు సమీపిస్తున్న తరుణంలో హోరాహోరీగా సాగుతున్న పోరులో దూకుడు పెంచన బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో అధికారపార్టీకి పెద్ద షాక్ తగిలింది.

ఇది కూడా చదవండి:- తుమ్మల అక్కడ నుంచే పోటీ

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఎందుకు రాజీనామా చేశానో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఇటీవలే చెప్పానని రాజీనామా లేఖలో ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం. ఈ మేరకు మధ్యాహ్నం తరువాత ఆ ఇద్దరు నేతలు బాలసానిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ఇది కూడా చదవండి:- మధిర కు భట్టి విక్రమార్క పోటీ

ఇదిలా ఉంటే బాలసానిని  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. బాలసానిని కలిసి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.