Telugu News

జిల్లాలో బాణాసంచా అక్రమ నిల్వలు

కోట్లలో వ్యాపారo.. జెబులు నింపుకుంటున్న వ్యాపారులు

0

జిల్లాలో బాణాసంచా అక్రమ నిల్వలు

== అక్రమాలు కోకొల్లలు..గోదాముల్లో నిల్వలు

== సరుకు చూపేది రూ. వేలల్లో…రవాణా చేసేది రూ. లక్షల్లో

== కోట్లలో వ్యాపారo.. జేబులు నింపుకుంటున్న వ్యాపారులు

== ఏళ్ళు తరబడి అక్రమ వ్యాపారం..

== కనిపించని తనిఖీలు..అంతా వారి కన్నుసందల్లోనే

 (నిఘావిభాగం- విజయం న్యూస్)

ఖమ్మం, సత్తుపల్లి,మధిర, కొత్తగూడెం నియోజకవర్గంలో టపాసుల అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది‌.. అనుమతులు తారాజువ్వలకే అయినప్పటికి ప్రభుత్వం నిషేధిత మందులను దర్జాగా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది‌‌..వేలల్లో చూపిస్తూ లక్షల్లో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది… అయినప్పటికి అధికారులు తనిఖీలు శూన్యం‌.. వారే నిమ్మకనీరేత్తనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.. ముఖ్యంగా వారికన్నుసన్నాల్లోనే జరుగుతున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.. జర్నలిస్టులు అక్కడికి వెళ్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.. అందరికి మట్టాల్సింది ముడుతున్నాయి..మీరు చేసేదేముందేముందంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. అసలు అక్కడ ఏం జరుగుతుందో పూర్తి వివరాలు చూద్దాం.

ఇది కూడా చదవండి:- ఏన్కూరులో 11 కేజీల గంజాయి పట్టివేత

దీపావళి మూడు రోజులు జరిగే బాణసంచా వ్యాపా రంతో వ్యాపారుల కళ్లలో ఆనంద తారాజువ్యలు వెలిగిపోతున్నాయి…కానీ ఆ టపాసుల శబ్దాల మధ్య అక్రమాల పరంపరం కూడా తారస్థాయిలో సాగుతుందన్న విమర్శలు న్నాయి.దీపావళికి మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో వ్యాపారులు విక్రయాలకు సంబంధించిన ప్రక్రియకు సిద్ధమవుతు న్నారు.అయితే కొందరు వ్యాపారులు మాత్రం దొడ్డి దారిన దొంగసరుకును సత్తుపల్లి లోకి తీసుకొచ్చి అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు న్నారు.ఏటా దీపావళిని కొందరు అక్రమ వ్యాపారులకు సిరులు కురిపించే కనకమహాలక్ష్మిని ఇంటికి నడిపించే పండుగగా మార్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి:- పత్రాలేందుకు..? పైసలీవ్వూ..?

వ్యాపారం నడిచేది మూడు రోజులే అయినా లావాదేవీలు మాత్రం రూ.కోట్లలో జరుగుతుంటాయని,సరైన నిఘా లేకపోవడంతోనే అక్రమాలు కోకొల్లలుగా సాగుతునాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా దీపావళి మందులు విక్రయాల్లో భారీగా అక్రమ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
== బాణసంచా రవాణాపై తనిఖీలు ఎక్కడ..?
బాణసంచా విక్రయాల అంశంలో స్టాక్ పాయింట్, రవాణా  వీటన్నిటిపై విజిలెన్స్, పోలీసు అధికారులు, ఫైర్ అధికారులు ఎప్పటికప్పుడు ముమ్మర తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాణసంచా స్టాక్ పాయింట్ వివరాలు తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ వ్యాపారులు స్టాక్ పాయింట్ ప్రదేశాలు అడ్రస్సుల్లో  తేడాలు చూపిస్తున్నట్లు సమాచారం.వ్యాపారులు చూపించే అడ్రస్ ఒక దగ్గర.. స్టాక్ పాయింట్ మరొక దగ్గర.. టపాసులు నిలువలు విక్రయాలు మరొక దగ్గర జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాణసంచా దుకాణాల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన టపాసులు మాత్రమే విక్రయిస్తున్నారా.. లేదంటే నిషేధిత టపాసులు ఉన్నాయా.. లేవా అనే విషయాలపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి:- కూసుమంచిలో తుమ్మల వర్గీయులకు రైతులు షాక్

కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న దుకాణాల్లో విషయాలు ఎక్కడ కూడా తనిఖీలు జరగడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులకు అక్రమ వ్యాపారం జరుగుతుందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికి ఎవరు తనిఖీలు చేసే పరిస్థితి లేదని, పట్టించుకునే నాధుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వ్యాపారులు అమ్మే సామగ్రి అధికారికంగా తీసుకువచ్చిందా? లేక ఆక్ర మంగా తీసుకువచ్చి అమ్ముతున్నారా? అన్న విషయాలను మాత్రం పట్టిం చుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు ఆక్రమ వ్యాపారానికి తెరలేపేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది.పండుగకు ముందే దొడ్డి దారిన దొంగసరుకు తీసుకొచ్చి రూ.కోట్ల ఆదాయం గడించేందుకు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అక్రమ వ్యాపారం సాగుతోందనడానికి గతంలో లారీల కొలదీ పట్టుబడ్డ బాణసంచానే నిదర్శనంగా నిలుస్తుండగా.తాజాగా గత ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద ఖమ్మం అర్బన్ పోలీసులు తనిఖీలు చేసి ఏపీలోని అమరావతి నుంచి అక్రమంగా బాణసంచా తీసుకొస్తున్న ఓ వాహనాన్ని పట్టుకున్నట్లు సమాచారం.ఈ  క్రమంలో ఈ ఏడాది కూడా బాణసంచా నిల్వలు విక్రయాలుకు రవాణాపై దృష్టిసారించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

== అక్రమ వ్యాపారం సాగేదిలా..

నిబంధనల ప్రకారం వ్యాపారులకు లైసెన్స్లు కేటాయించిన తర్వాత మాత్రమే సామగ్రి కొనుగోలు చేయాలి. కానీ కొందరు వ్యాపారులు ముందుగానే సరుకు తీసుకువచ్చి నిల్వ ఉంచుతున్నారు. అలా సరుకును తీసుకొచ్చే వారిలో కొందరు వేబిల్లుల్లో తక్కువగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒక లారీలో రూ.50లక్షల వరుకు ఉంటే దానిని కేవలం రూ5.లక్షల సరుకు ఉన్నట్టుగానే చూపించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి.రాత్రిపూట మాత్రమే రవాణా చేస్తూ.

ఇది కూడా చదవండి:- “దళితబంధు” రాజకీయ ఎత్తుగడేనా..?

ఆ మార్గంలో ఉన్న చెక్ పోస్టుల్లోని అధికారులతో ముందుగానే విషయం మాట్లాడుకుని వారికి నయానో భయానో తమ అక్రమ మార్గాన్ని సక్రమంగా నిర్వహించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అలా జిల్లా కేంద్రాలకు తీసుకువచ్చిన తర్వాత ఆ సామగ్రిని విభజించి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇలా అక్రమంగా జిల్లాకు తెచ్చే దీపావళి బాణసంచా నిల్వల విలువ రూ. కోట్లలోనే ఉంటుందనేది అంచనా. ఎలాంటి పేలుడు పదార్థాలను జనసంచారం ఉండే ప్రదేశాల్లో నిల్వ ఉంచడంకానీ,బస్సుల్లో, రైలులో కానీ రవాణా చేయకూడదు. కానీ రాత్రిపూట నడిచే కొన్ని ప్రైవేటు బస్సుల్లో కూడా ఈ దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. మరి కొన్ని ప్రైవేటు పార్శిల్ సర్వీ సుల్లో దీపావళి సామగ్రిని కూడా సాధారణ పార్శిల్ కింద చూపి రవాణా సాగిస్తున్నారని సమాచారం.
== ఆ శాఖలు దృష్టి సారించాల్సిందే…

జిల్లాలో ప్రతి ఏటా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టాలంటే విజిలెన్స్ అధికారులు,వాణిజ్య పన్నులశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు తప్పనిసిరిగా దృష్టి సారించాల్సిందే. వాస్తవానికి షాపులు కేటా యించిన తర్వాత ఆ వ్యాపారులకు చెందిన గోదాముల్లో ఎంత సరుకు ఉంది అన్న విషయాన్ని పరిశీలించాల్సిన రెవెన్యూ అధికారులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. జిల్లాకు ఎంత స్థాయిలో పేలుడు పదార్థాలు న్నాయి? అవి ఎక్కడెక్కడ ఎంతెంత స్థాయిలో ఉన్నాయి. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఏ మేరకు నష్టం వాటిల్లుతుంది? అన్న విషయాలను నమోదు చేసుకుని దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అగ్నిమాపకశాఖ కూడా నామమాత్రంగానే చర్యలు చేపడుతోంది. వీటికి తోడు విజిలెన్స్ నామమాత్రపు తనిఖీలతో సరి పెట్టడం, మరోవైపు చెక్ పోస్టుల వద్ద పట్టించుకోకపోవడం, ఈ తోడు జిల్లాలో రూ.కోట్ల మతాబుల పన్ను ఎగవేస్తున్నా వారిపై వాణిజ్య పన్నుల శాఖ కన్నేయడంలేదు. ఆ శాఖ దృష్టిసారించకపోవడంతో దాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమ వ్యాపారులు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చిన్న వ్యాపారులకు ఈ అక్రమ వ్యాపారం వల్ల పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. వారు నిబంధనల ప్రకారం లైసెన్స్ మంజూరు అయిన తర్వాత స్టాకు తెచ్చుకోవడం వల్ల కచ్చితమైన ధరలకు అమ్మితేనే వారికి కొద్దో గొప్పో లాభం వస్తుంది. కానీ ఈ ఆక్రమ వ్యాపారం చేసేవారు తక్కువ రేట్లకు సామగ్రి ఇవ్వడంతో కొనుగోలుదారులు అటు వైపు మొగ్గుచూపుతారు. దీంతో చిన్న వ్యాపారులు చిన్నబోయే ప్రమాదం ఉంది. ఎప్పటి నుంచో జిల్లాలో ఈ అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఏ. మాత్రం దానిపై దృష్టిసారించలేదు.నాలుగేళ్ల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కదిలిన జిల్లా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో అసలు విషయం బహిర్గతమైంది. గతంలో ఓ మండలంలో దాడులు నిర్వహించిన సమయంలో అక్కడ ఉన్న ఆశ్రమ నిల్వలు రూ.50 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. అయితే వారు దాడులు చేయడంలో ఒకడుగు ముందుకు వేసి త్వరగా ఆ స్థలానికి చేరుకున్నట్టయితే మరో రూ.50లక్షల నిల్వలు దొరికి ఉండేవని ఆ శాఖలోనే చర్చ జరిగింది. అక్కడ అక్రమ నిల్వలను పట్టుకున్న అధికారులు మాత్రం దానితోనే సరిపెట్టుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలోనే తొలి సారిగా అంత పెద్దమొత్తంలో అక్రమ నిల్వలను స్వాధీనం చేసు కున్న అధికారులు ఈ ఏడాది మరింత నిఘా పెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. చూద్దాం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాల్సిందే.