Telugu News

బాంచెన్ కాల్మొక్తా… గ్రామాన్ని అభివృద్ధి చేయండి..!

*గ్రామ సభలో సర్పంచ్,పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడ్డ గ్రామస్థుడు

0

బాంచెన్ కాల్మొక్తా… గ్రామాన్ని అభివృద్ధి చేయండి..!

*గ్రామ సభలో సర్పంచ్,పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడ్డ గ్రామస్థుడు

*గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వేడుకోలు

*నిధులున్నా అభివృద్ధి శూన్యం

(మహబూబాబాద్ చిన్నగూడూరు విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో గ్రామ సభ రసా బాసగా మారింది.గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ని నిలదీశారు.గ్రామ సభకు గ్రామ స్థాయి అధికారులు హాజరు కాక పోవటంతో గ్రామ సభలో గందరగోళం నెలకొంది. బాంచెన్ సారు కనికరించండి సారు. మా చిన్న గూడూరు ఎస్సి కాలనిలో అంగన్వాడీ సెంటర్ ని ఏర్పాటు చేయాలని,అంతేకాకుండా గ్రామంలో సరైన రోడ్ల వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి అంటూ గ్రామ సభలో సర్పంచ్,పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్థులు వేడుకున్నారు.పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దాలనే సంకల్పం నిరుగారిపోతోంది.పంచాయితీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సర్పంచ్ కాళ్లపై పడాల్సిన దుస్థితి దాపురించింది.ఈ విషయమై జిల్లా పంచాయితీ అధికారులు స్పందించి చిన్న గూడూరు సర్పంచ్,పంచాయతీ సెక్రటరీ, పాలకవర్గం పై చర్యలు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

also read :-ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కే పట్టంకట్టారు : మాజీ ఎంపీ పొంగులేటి