బండి సంజయ్ అరెస్ట్ మాత్రమే..? జైలుకు పంపలేదు..?
== బండి అరెస్ట్‌పై లోక్‌సభకు తప్పుడు సమాచారం
== కేవలం అరెస్చ్టేసి విడిచి పెట్టామని పోలీసుల వెల్లడి
== ఈ సమాచారం ఆధారంగానే లోక్‌సభ బులిటెన్
== తప్పుడు సమాచారంపై మండిపడుతున్న బిజెపి నేతలు
(న్యూఢల్లీ-విజయంన్యూస్)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ను శాంతిభద్రతల నిమిత్తం కేవలం అరెస్ట్ చేశాము.. జైలుకు పంపలేదు.. వెంటనే వదిలేశాము.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. సాక్ష్యాత్తు పార్లమెంటరీ సెక్రటేరియట్.. బండి సంజయ్ అరెస్ట్ పట్ల బులిటెన్ విడుదల చేసింది.. కానీ తెలంగాణలో మాత్రం బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం, కరీంనగర్ జైలుకు పంపించడం జరిగింది.. మరి ఈ తప్పుడు సమాచారం లోక్ సభకు ఇచ్చింది ఎవరు..? వాళ్లు సమాచారం తెలుసుకోకుండా ఎందుకు బులిటెన్ విడుదల చేశారు..? తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసులపై, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు మండి పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇదికూడ చదవండి: బీజేపీ అసలు రంగు బయటపడింది: బీఆర్ఎస్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ సెక్రటేరియట్ బులిటెన్ విడుదల చేసింది. 151 సీఆర్పీసీ కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం పోలీసులు తెలిపినట్లు బులిటెన్ లో తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకే బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.కరీంనగర్ లో సంజయ్ ని అరెస్ట్ చేసి తర్వాత రాచకొండ పరిధిలోని బొమ్మల రామారం స్టేషన్ కు తరలించినట్లు బులిటెన్ లో వెల్లడిరచారు. అనంతరం కస్టడీ నుంచి విడిచిపెట్టినట్లు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి కరీంనగర్ పోలీసులు తెలిపారు. బండి సంజయ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.అయితే లోక్‌సభనే పోలీసులు తప్పుదోవ పట్టించారు. శాంతిభద్రతలకు భంగం కల్గిస్తున్నారని ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసినట్లు బులెటిన్‌లో వెల్లడిరచారు. తెలంగాణ పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా బులిటెన్ విడుదల చేయడం గమనార్హం. లోక్‌సభకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. నిన్నటి
ఇది కూడా చదవండి: జార్ఖండ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.
బులిటెన్‌ను లోక్‌సభ నేడు విడుదల చేసింది. లోక్‌సభ బులిటెన్‌లోని అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు ప్రకటించారు. టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ జైలుకు వెళ్లారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీతో సంబంధం ఉందంటూ మంగళవారం రాత్రి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి లీకేజీకి ఆయనే ప్రధాన సూత్రధారి అని ప్రకటించారు. ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్టును బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కేంద్రమంత్రి అమిత్ షా , నడ్డా, తరుణ్ ఛుగ్.. తెలంగాణ నేతలతో మాట్లాడారు. అయితే పోలీసులు ఇప్పుడు తప్పుడు సమాచరం ఇవ్వడంపై స్పీకర్‌కు నేతలు ఫఙర్యాదు చేయనున్నారు.