Telugu News

బండి సంజయ్ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జన జాగరణ దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

0

బండి సంజయ్ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జన జాగరణ దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

దీక్షకు అనుమతి లేదంటూ కరీంనగర్ లోని సభావేదిక వద్దకు వచ్చిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

also read :-నీ పాలనపై చర్చకు సిద్దమా..? కేసీఆర్‌కు తరుణ్‌ చుగ్‌ సవాల్‌

దాంతోపాటు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన 317 జీఓను సవరించాలనే డిమాండ్ తో ఇవాళ జన జాగరణ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు సంజయ్.

రేపు ఉదయం 5 గంటల వరకు నిద్రపోకుండా జాగరణ చేసి నిరసన తెలుపుతామన్నారు. తీరా దీక్షకు సిద్ధమయ్యే సమయంలో అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారు కరీంనగర్ పోలీసులు.