Telugu News

నేలకొండపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

0

నేలకొండపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

== పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేలకొండపల్లిలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  నేలకొండపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన  తెలిపారు. అనంతరం బండి సంజయ్ దిష్టి బొమ్మను దాన సంస్కారాలు   చేశారు.ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ బిజెపి నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ఇది కూడా చదవండి: పొలవరం ముంపు గ్రామాల సంగతేంటి..?

బండి సంజయ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమానికి మండల సెక్రటరీ వెన్నబోయిన శ్రీనుగారు,జిల్లావైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, సోసైటీ చైర్మన్ కోటిసైదిరెడ్డి, టౌన్ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండు సతీష్, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, మంగాపురం తండా సర్పంచ్ భూక్య సుధాకర్, మండలం నాయకులు మరికంటి రేణుబాబు, ఒకటో వార్డు నెంబరు కొండ కనక ప్రసాద్, వార్డు నెంబర్ కందరబోయిన భాను, మాజీ వార్డు నెంబర్లు పగిడికత్తుల రాంబాబు, కైలాస్ వెంకటేశ్వర్లు, మోర మల్లయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురపల్లి వేణు నాదం, కుక్కల సామీలు, బచ్చలకూరి శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు బుల్లి కొండ వెంకటనారాయణ, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు, యూత్ నాయకులు దాసరి ఉదయ్, లింగం ఎలమంద, చింతల వెంకటేష్, నాగేశ్వరరావు,పగిడికత్తుల వెంకటేష్, సోషల్ మీడియా అధ్యక్షుడు మాదాసు ఆదాం, సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు గంధం నాగరాజు,  బీఆర్ఎస్ పార్టీ  నాయకులు కార్యకర్తలు అతి సంఖ్యలో పాల్గొన్నారు

ఇది కూడా చదవండి: ఈడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత