Telugu News

బండి సంజయ్ విడుదల

జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్

0

బండి సంజయ్ విడుదల

== ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ నేతలు

== జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్

(కరీంనగర్-విజయంన్యూస్)

పడవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బండి కి బెయిల్ లభించడంతో ఆయన కరీంనగర్  జైయిల్ నుండి విడుదలైయ్యారు. బండి విడుదల సందర్బంగా బి జె పి శ్రేణులు సంబరాలు చేశారు..ఘనంగా స్వాగతం పలికారు. బండి సంజయ్ జిందాబాద్.. బీఆర్ఎస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జైలు వద్దకు భారీగా పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాఫ్తంగా ప్రథమ శ్రేణి నాయకత్వం జైలు వద్దకు వచ్చింది.      ఇది కూడాచదవండి:   బండి సంజయ్ అరెస్ట్ మాత్రమే..? జైలుకు పంపలేదు..?

== జైలు వద్ద 144 సెక్షన్.. భారీ బందోబస్తు

బండిసంజయ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఉదయం బండి సంజయ్ ను విడుదల చేశారు. దీంతో ఎలాంటి చిన్న అవాంచనీయన సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే  పోలీసులు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్  విదించారు. శుక్రవారం రోజున ఉదయం 6 గంటల  నుండి కరీంనగర్ నగరం లోని ఐబి చౌరస్తా,  గ్రేవ్ యార్డ్,  జైలు పరిసర ప్రాంతాలు,  వెంకటేశ్వర టెంపుల్  ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడమైనదని పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు తెలిపారు.

ఇది కూడా చదవండి: త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటన