అసరా పింఛన్లు పత్రాలిచ్చారు.. పైసలేప్పుడిస్తరు
భారత్ జోడో యాత్రలో సర్కార్ పై పైర్ అయిన కాంగ్రెస్ నేత ఎండీ జావిద్
అసరా పింఛన్లు పత్రాలిచ్చారు.. పైసలేప్పుడిస్తరు
== పింఛన్ కోసం వేలాధి మంది ఎదురుచూస్తున్నరు
== చేతగానోళ్ళు పత్రాలేందుకీచ్చిండ్రు
== మాయమాటలతో ఎన్నాళ్లు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తరు
== డబుల్ బెడ్ రూమ్ అన్నరు సున్నం పెట్టిండ్రు
== ఖాళీ స్థలం ఉంటే చాలు రూ.6లక్షలిస్తమన్నరు అడ్రస్సేలేరు
== కరెంట్ బిల్లు మోత..నీళ్ల గోస..డ్రైనేజీల అవస్థ
== ఎన్నాళ్లు మా ప్రజలకు ఈ అవస్థలు
== మురికివాడగా 6వ డివిజన్
== భారత్ జోడో యాత్రలో సర్కార్ పై పైర్ అయిన కాంగ్రెస్ నేత ఎండీ జావిద్
== మూడవ రోజు 6వ డివిజన్ లో ముమ్మరంగా కొనసాగిన పాదయాత్ర
== ఘనస్వాగతం పలికిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు
ALLSO READ- ఏజెన్సీలో బినామీల దందా..?
ఖమ్మం, అక్టోబర్ 11(విజయంన్యూస్):
57 ఏండ్లకే పింఛన్ ఇస్తున్నమని గొప్పలు చెప్పిండ్రు.. మంజూరు పత్రాలిచ్చిండ్రు.. హాడాహుడి హంగామా చేసిండ్రూ..అంతా మేమే చేస్తున్నమని గొప్పలు చెప్పిండి.. అంతా బాగానే ఉంది కానీ పత్రాలిచ్చిన పేదలకు లబ్దిదారులకు పైసలేందుకు ఇవ్వడం లేదో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని పీసీసీ మెంబర్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ ప్రశ్నించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర కు సంఘీభావంగా ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జింకలతండా నుంచి ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జావిద్ ఆధ్వర్యంలో ప్రారంభించిన భారత్ జోడో గ్రామయాత్ర కార్యక్రమం మూడవ రోజు కొనసాగింది. ఖమ్మం నగరంలోని 6వ డివిజన్ లో ఈ యాత్ర కొనసాగింది. ఈ గ్రామ యాత్రను ఖమ్మం జిల్లా మహిళలు అడుగడుగున హారతులిస్తూ స్వాగతం పలికారు. గ్రామ యాత్ర అడుగడుగున నీరాజనాల పలుకుతుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలను బీజేపీ నేతల భారీ నుంచి రక్షించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపట్టారని, ఆ యాత్రకు సంఘీభావంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 150 రోజుల పాటు భారత్ జోడో గ్రామయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ALLAo READ-అక్రమ మద్యాన్ని అరికట్టాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నో అనేక హామీలు ఇచ్చారని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. 57 ఏళ్లకే పింఛన్ అంటూ గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ మంజూరు పత్రాలను హడావుడి చేసి అంగు ఆర్భాటాలు చేసి లబ్ధిదారులకు అందించిన ప్రభుత్వం కానీ నేటి వరకు కొత్త పింఛన్దారులకు ఒక రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. లక్షలాదిమంది పింఛన్దారులు పింఛన్ పైసల కోసం ఎదురుచూస్తున్నారని, పింఛన్ ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు జబ్బలు చరుసుకుకోవాలని దుయ్యబట్టారు. పింఛన్ దారులందరికి వెంటనే పైసలు ఇవ్వకపోతే కాంగ్రెస్ లబ్ధిదారులకు అండగా నిలబడతామన్నారు.
* *6వ డివిజనలో అన్ని సమస్యలే
ఖమ్మం నగరంలో ఆరో డివిజన్ సమస్యలు వలయంలో కొట్టుమిట్టాడుతుందని, ఎక్కడ చూసినా డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని, వీధులలో, ఖాళీ స్థలాలు మురుగునీరు చెరువులు తలపిస్తున్నాయని కాంగ్రెస్ నేత ఎండి జావిద్ ఆరోపించారు. దోమల ఉధృతి అధికమై, విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదనా వ్యక్తం చేశారు. ఖమ్మం నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్రమంత్రి పువ్వాడ ఆరవ డివిజన్లో పర్యటించాలని, అక్కడ ప్రజలే అభివృద్ధి అంటే ఏంటో చెప్పి చూపిస్తారని తెలిపారు. ఆ డివిజన్లో పర్యటిస్తుంటే ప్రజలందరూ ఎదురుగా వచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారని, ఆ సమస్యల పరిష్కారం చేయలేని కార్పొరేటర్లు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరో డివిజన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అధికారం వచ్చిన వెంటనే ఆరో డివిజన్లోని సమస్యలని పరిష్కరిస్తామని హామీని ఇచ్చారు అడుగడుగున నీరాజనం ఖమ్మం నగరంలోని ఆరే డివిజన్లో భారత్ జూడో గ్రామయాత్ర చేపట్టిన కాంగ్రెస్ నేతలకు డివిజన్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు మహిళలు హారతులు ఇస్తూ
ఖమ్మం నగరాభివృద్ది ఎక్కడుంది :ఎండీ.జావిద్
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మల్లీదు వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు, పల్లెబోయిన భారతి, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్, కిలారు రమణ, ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దామ స్వరూప, ఖమ్మం జిల్లా మహిళా సెక్రెటరీ ఏలూరి రజిని, కావ్య,లాల్ బి, రవి, కరుణాకర్ రెడ్డి, శంకర్ నాయక్, రఘునాధపాలెం మండలం సీనియర్ నాయకులు భూక్య బాలాజీ, కొంటిముక్కల నాగేశ్వరావు, బాతుల సుధాకర్, కోటపాడు సర్పంచ్ రాయల మోహన్ రావు, ఖమ్మం నగరం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అబ్బాస్, గౌస్, ఏదో డివిజన్ అధ్యక్షులు పార్వతి శ్రీనివాస్, ఉపేందర్, మావిడాల పుల్లయ్య, కనక రత్నం, ఐదవ డివిజన్ అధ్యక్షులు ముఖ్య రమేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దామ స్వరూప, దివ్య, ఖమ్మం జిల్లా కార్యదర్శి ఏలూరి రజిని,హరిసింగ్, కిలారు రమణ యశ్వంత్ గౌస్ తాజ్ పాల్గొన్నారు.