Telugu News

ముప్ఫై ఏండ్లుగా చీకట్లో మగ్గుతున్న బాటన్న నగర్

🔹కరెంట్ లేక బాటన్న నగర్ ఆదివాసీలు అవస్థలు

0

ముప్ఫై ఏండ్లుగా చీకట్లో మగ్గుతున్న బాటన్న నగర్

🔹కరెంట్ లేక బాటన్న నగర్ ఆదివాసీలు అవస్థలు

🔹ఫారెస్ట్ అధికారుల వేధింపులు

🔹పోడు భూముల కు పట్టాలు లేవు

🔹మరికొంతమంది కి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు

🔹దట్టమైన అడవుల్లో జీవనం

🔹పాలకులు నిర్లక్ష్యం తో ఆదివాసీల బ్రతుకులు చిన్నాభిన్నం.

(గుండాల -విజయం న్యూస్):-

గుండాల మండలం మామా కన్ను గ్రామపంచాయతీ లో కిష్టాపురం రెవిన్యూ రికార్డ్ లో ఉన్న బాటన్న నగర్ ఆదివాసీల కష్టాలు పగవాడికి కూడ రావద్దని అక్కడ ఆదివాసీలు కోరుతున్నారు. దాదాపు గా ముప్ఫై ఏండ్లుగా కరెంట్ లేక చీకట్లో మగ్గుతున్నారు. గుండాల నుండి ఇళ్లేందు వెళుతున్న రహదారి పక్కనే ఉన్న బాటన్న నగర్ ఆదివాసీల పరిస్థితి అగోమ్య చారంగ తయారైంది. మనం మన ఇంట్లో ఒక గంట కరెంట్ పోతేనే చాలా చిరాగ్గు ఉండే నాగరిక సమాజం నేడు బాటన్న నగర్ ఆదివాసీల ను ఏవిధంగా ముప్ఫై ఏండ్లుగా చీకట్లో ఎందుకు ఉంచుతున్న ర నీ అక్కడ ఆదివాసీలు  ప్రశ్నిస్తున్నారు.బాటన్న నగర్ లో జీవిస్తున్న ఆదివాసీల కు చాలా మందికి రేషన్ కార్డులు లేక బియ్యం అందక ఆకలి తో ఆలమటిస్తూ చీకట్లో చిక్కుల్లో జీవిస్తున్నారు.

ఎన్ని ప్రభుత్వ వాలు వచ్చన ,ఎంతమంది అధికారులు మారిన కూడ వలస ఆదివాసీల బ్రతుకులు మారడం లేదు. ఛత్తీస్ ఘడ్ , సుకుమా,జగడల్పుర్ కుంట దంతేవాడ నుండి చాల మంది ఆదివాసీలు ఆంధ్ర, తెలంగాణ కు వలస వచ్చి దట్టమైన అడవుల లో జీవనం కొనసాగిస్తూ నాగరికత సమాజానికి దూరంగఉంటున్న ఈ ఆదివాసీల కూ సకల సౌకర్యాలు కల్పించడం లో గోరంగా విఫలం కావడంతో ఆదివాసీల జీవన విధానం విధ్వంసం అవుతుంది.గతంలో ఒక స్వచ్చంద సంస్థ మంచి నీళ్ల బోర్ వేస్తే ఫారెస్ట్ అధికారులు దాన్ని పికి వేశారు. ఆ తరువాత రాజీవ్ గాంధీ హన్మంత్ జిల్లా కలెక్టర్ గ ఉన్నప్పుడు కేవలం ఒక బోర్ వేశారు.

ఇపుడు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. రాత్రి పూట కరెంట్ లేకపోవడంతో విషకీటకాలు కాటుకు గురై చనిపోయిన సంఘటన లు ఉన్నాయి. రాత్రి పూట ఇంట్లో పాములు తేళ్లు వస్తూ వుంటాయని, రాత్రి పూట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిద్రపోవాల్సిన పరిస్థితిఏర్పడిందనీ బాటన్న నగర్ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. నోరు లేని,అమాయకత్వం కలిగిన ఆదివాసీల ను చూసి వారు సాగు చేస్తున్న పోడు భూముల ను బలవంతంగా లాక్కుని హరితహారం పేరిట మొక్కలు నాటుతున్నారనీ బాటన్న నగర్ ఆదివాసీలు ఆవేదన వ్యక్తంచేశారు.

కోరం వెంకటేశ్వర్లు

మమ్మల్ని ఏ ప్రభుత్వం పాటించుకోవడం లేదు. కరెంట్ లేక సోలార్ వెలుతూరు లో జీవిస్తున్నాం. ఫారెస్ట్ అధికారుల వలన కరెంట్ రావడం లేదు.

రామ్ లాల్

ఎన్నిలకపుడు రాజకీయ పార్టీలు ఎన్నో మాటలు చెబుతాయి. మా బాధలు వారికి పట్టవు. కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము

also read :-అద్భుతమైన శిల్ప నైపుణ్యం రామప్ప.

please subscribe this chanel smiling chaithu